Star Heroine
Star Heroine : సినిమా అనేది ఒక జూదం లాంటిది. సక్సెస్ వస్తుందా రాదా అనేది ఎవరు క్లారిటీగా చెప్పలేరు. సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేదాన్ని బట్టి సినిమా సక్సెస్ అయిందా? లేదంటే ఫెయిల్యూర్ ను మూటగట్టుకుందా? అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు.. అందువల్లే ఇండస్ట్రి లో ఎక్కువమంది సినిమాలను చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో కెరియర్ అనేది నిలకడగా ఉండదు. ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితులైతే ఉంటాయి…
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి స్టార్ హీరో ఇమేజ్ వచ్చిందంటే చాలు వరుస సినిమాలను చేస్తూ ఆ స్టార్ డమ్ ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతూ ఉంటారు… ఇక ఇలాంటి సందర్భంలోనే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోయిన్ల తో కొంతమంది హీరోలు ఎఫైర్స్ పెట్టుకొని వాళ్ళని స్టార్లుగా మారుస్తామని మాట ఇస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరైన నటుడు ఒక హీరోయిన్ తో సినిమా చేశాడు. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించలేదు. దాంతో ఆవిడను స్టార్ హీరోయిన్ గా చేస్తానని ఆమెతో ఎఫైర్ పెట్టుకొని దాదాపు మూడు సినిమాల్లో అవకాశం అయితే ఇచ్చాడు. అయినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తద్వారా తనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కూడా వాళ్ళ సినిమాల్లో అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేశాడు. అయినప్పటికీ లక్కు కలిసి రాకపోవడంతో ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఎట్టకేలకు చేసేది ఏమీ లేక ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది…
ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలంటే మాత్రం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే చాలామంది నటీమణులు ఇండస్ట్రీకి హీరోయిన్ గా వచ్చినప్పటికి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడుతూ ఉంటారు.
హీరోయిన్ గా ఒక సక్సెస్ వస్తే స్టార్ హీరోయిన్ అనిపించుకుంటారు. ఇక అదే విధంగా మరొక ఫ్లాప్ అయితే వచ్చినట్టయితే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ కి కూడా చేరుకోవచ్చు. అందుకే ఇండస్ట్రీ అనేది వైకుంఠపాళీ లాంటిది ఎప్పుడు నిచ్చెన వస్తుందో, ఎప్పుడు పాము మింగుతుందో ఎవ్వరికి తెలియదు…
కాబట్టి ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ముందుకు వెళ్లడమే తప్ప ఎవరు స్టార్ పొజిషన్ లో ఉంటారు, ఎవరు ఫేడ్ అవుట్ అయిపోతారు అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది… నిజానికి ఇండస్ట్రీ అనేది ఒక జూదం లాంటిది సక్సెస్ వస్తే స్టార్ట్ డమ్ వస్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం ఎవరూ పట్టించుకోరు…ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ కి వస్తే బాగుంటుంది…