Telangana Elections 2023: తెలంగాణలో రాజకీయ వేడి తీవ్రమైంది. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు మూడోసారి గెలుపు పెద్ద విషయమేమీ కాదని అనుకుంది. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో అధికార పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కొన్ని వర్గాల ఓట్లు బీఆర్ఎస్ కు అనుకూలమే అనిపించినా తటస్ఠ ఓటర్ల విషయంలో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. తటస్థ ఓటర్లు ఏ పార్టీ ఇచ్చిన తాయిలాలకు ఆకర్షితులు కారు. దీంతో వారికి తమ వైపునకు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ముప్పు తిప్పలు పడాల్సి వస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ లోనూ హైటెన్షన్ మొదలైనట్లు సమాచారం.
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రైతులు, వృద్ధులతో పాటు కొన్ని కులాల వారిని అక్కను చేర్చుకుంది. వారికి ప్రత్యేక పథకాలు ప్రకటించి ఆ పార్టీకే ఓట్లు పడేలా ప్లాన్ వేసింది. కాన తటస్థ ఓటర్ల విషయంలో మాత్రం ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీరు ఏ పార్టీకి సపోర్టు చేయకపోయినా పోలింగ్ బూత్ లోకి వెళ్లే వరకు వారి వైఖరి అర్థం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, వృద్ధులకు ఆసరా ఫించన్ తో పాటు కొన్ని వర్గాల వరకు ప్రత్యేక పథకాలు కేటాయించింది.
అయితే కేసీఆర్ ప్రకటించిన ఏ పథకాలు లబ్ధిపొందని వారు చాలా మందే ఉన్నారు. దీంతో తమకు ఈ ప్రభుత్వంతో తమకేంటి ప్రయోజనం అని భావిస్తే మాత్రం బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవు. బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉన్న వారితో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ద్వారా తాము గట్టెక్కుతామని ఆ పార్టీ ధీమాగా ఉంది. అంతేకాకుండా తటస్థ ఓటర్లు సైతం ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో తటస్థ ఓటర్ల నాడి పట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మక ప్లాన్ వేస్తోంది. విస్తృతమైన సర్వేలు చేయించి వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి వారు ఎటువంటి పథకాలకు ఆకర్షితులవుతారో తెలుసుకొని వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో తటస్థ ఓటర్లను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ వేస్తోంది.