HCU Land Issue: హైదరాబాద్‌లోకి కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర హైకోర్టుతోపాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పందించింది. 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం(State Government)చెట్లు తొగించడంపై సుమోటాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు(Supream Court).. అక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఏప్రిల్ 3న(గురువారం) తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు విద్యార్థులు, పర్యావరణవాదులు, స్థానిక సంఘాలకు పెద్ద విజయంగా పరిగణించబడుతోంది, ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయం(University) సమీపంలోని 400 ఎకరాల భూమిని పరిరక్షించే దిశగా ఒక అడుగుగా చూడబడుతోంది.
Also Read: ఏపీలో 2029లో విజేత వారే.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈజీ విశ్లేషణ!
సుప్రీం కోర్టు తీర్పు వివరాలు
సుప్రీం కోర్టులో జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును సుమోటో తీసుకుంది. కంచ గచ్చిబౌలి(Kancha Gachi bouli) ప్రాంతంలో వందల ఎకరాల్లో చెట్లను నరికివేయడం, అభివృద్ధి పనులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలను నిషేధించింది. అంతేకాక, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ(Telangana Chief Secratry)ని ఈ ప్రాంతంలో అత్యవసర అభివృద్ధి అవసరం ఏమిటో వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో, కోర్టు ఈ భూమిని ‘డీమ్డ్ ఫారెస్ట్‘గా పరిగణించే అంశంపై కూడా చర్చించింది, ఇది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వాదనలకు బలం చేకూర్చింది.
వర్సిటీలో సంబరాలు..
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, HCU విద్యార్థులు క్యాంపస్‌లో సంబరాలు చేసుకున్నారు. ఈ భూములను రక్షించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు, పర్యావరణవాదులు నిరసనలు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో 455కి పైగా జాతుల జంతుజాలం, వృక్షజాలం (పీకాక్స్, బఫెలో లేక్స్, మష్రూమ్ రాక్స్ వంటివి) ఉన్నాయని, ఇది హైదరాబాద్‌లోని చివరి ‘గ్రీన్ లంగ్స్‘లో ఒకటిగా ఉందని వారు వాదించారు. తీర్పు తర్వాత, విద్యార్థులు క్యాంపస్‌లో సేంద్రీయ వాతావరణాన్ని కాపాడినందుకు ఆనందం వ్యక్తం చేశారు. కొందరు ‘సేవ్ ఏఇ్ఖ బయోడైవర్సిటీ‘ అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.
మొదటి నుంచీ వివాదమే..
కంచె గచ్చిబౌలి బూముల వివాదం దశాబ్దాలుగా నడుస్తోంది. HCU ఈ 400 ఎకరాల భూమి 1975లో తనకు కేటాయించిన 2,324 ఎకరాల్లో భాగమని పేర్కొంది. కానీ, 2022లో తెలంగాణ హైకోర్టు, ఈ భూమి బదిలీకి సంబంధించిన చట్టపరమైన ఆధారాలు లేవని తీర్పు ఇచ్చింది, దీనిని సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని తిరిగి తీసుకొని, టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి కేటాయించడంతో వివాదం ముదిరింది. దీనిపై విద్యార్థులు, వాటా ఫౌండేషన్ వంటి సంస్థలు పిల్‌లు దాఖలు చేశాయి.
తీర్పు తర్వాత..
తీర్పు తర్వాత, విద్యార్థులు పోలీసులతో ఘర్షణలు జరిగినప్పటికీ, సంబరాలు ఆగలేదు. BRS నాయకుడు కేటీ రామారావు ఈ తీర్పును స్వాగతిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)మాత్రం, ఈ భూమి 2004లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ కంపెనీకి కేటాయించబడిందని, దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని వాదించింది. సుప్రీం కోర్టు తీర్పు HCUవిద్యార్థులకు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ, ఈ వివాదం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది, రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను సమర్థించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి, ఏఇ్ఖ క్యాంపస్‌లో విద్యార్థులు ఈ తీర్పును ఒక విజయంగా జరుపుకుంటూ, తమ పర్యావరణ పరిరక్షణ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.