CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సీఎం పగ్గాలు చేపట్టారు. దాదాప ఏడాదిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రబుత్వం క్రమంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తోపాటు రైతుల పంట రుణాల మాఫీ జరిగింది. త్వరలోనే మిగతా హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఎన్నిలు ముగిసి ఏడాది కావొస్తున్నా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో రాజకీయాలు నిత్యం వాడీవేడిగా సాగుతున్నారు. ఢీ అంటే ఢీఅన్నట్లుగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్, కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడులు కూడా జరిగాయి. దీంతో ఇంతకాలం సాఫీగా సాగిన కాంగ్రెస్ పాలనపై స్వప్పంగా వ్యతిరేకత మొదలైనట్లు కనిపిస్తోంది. హైడ్రా కూల్చితేలు, మూసీ సుందరీకరణ పేరుతో చేపట్టిన కూల్చివేతలు ప్రభుత్వంపై ప్రధానంగా వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇక రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో జరుగలేదు. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్‌ఎస్ ఎత్తిచూపుతోంది. దూకుడు పెంచుతోంది.
ఆ తప్పులే అస్త్రంగా..
కాలం గడుస్తున్న కొద్ది పాలకులు తప్పులు చేస్తుంటారు. అవే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారతాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లను బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వాటినే హైలెట్ చేస్తోంది. కేసీఆర్ గతంలోనే ఈ విషయం చెప్పారు. ఏడాది టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల్లోకి Ðð ళ్దామని పేర్కొన్నారు. ఆయన చెప్పిట్లే.. ఏడాది లోపే వ్యతిరేకత మొదలైంది. హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపుపై ఏర్పాటు చేసిన హైడ్రాపై మొదట్లో ప్రశంసలు కురిశాయి. హైదరాబాద్ వాసులతోపాటు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాను స్వాగతించారు. అయితే మూసీ పరీవాహక ప్రాంత ఇళ్ల కూల్చివేత వివాదాస్పదమవుతోంది. ఈ విషయంలో రేవంత్ సర్కార్ స్పష్టమైన వైఖరితో ఉన్నా.. బీఆర్‌ఎస్‌ఎస్ నేతలు మాత్రం ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనిని తిప్పికొట్టడంలో అధికార కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారు.
తాజాగా కొండా సురేఖ కామెంట్ప్..
తాజాగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెడిసెండ్ కేటీఆర్‌తోపాటు, సినిమా రంగంలోని మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్ సర్కార్‌పై తిరగబడింది. పార్టీలకు అతీతంగా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. క్షమాపణ చెప్పినా.. బీఆర్‌ఎస్ ఈ అంశాన్ని వదలడం లేదు. దీనినే రాజకీయం చేస్తోంది. రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చింది. తాజాగా మంత్రి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, సిని ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతోంది.
రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయలపై పునం సమీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏకపక్షంగా, మొండిగా పోతే రాబోయే రోజుల్లో చిక్కులు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఉంది. మొదట్లో పాలనపై పట్టు సాధించిన రేవంత్‌రెడ్డి, క్రమంగా సడలుతున్నట్లు కనిపిస్తోంది.