Gummadi Narsaiah
Gummadi Narsaiah : గద్దర్ కన్ను మూసిన తర్వాత ఈ విషయాన్ని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేపదే గుర్తుకు చేసింది.. గద్దర్ ను కెసిఆర్ తీవ్రంగా అవమానించారని.. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు గుర్తింపు ఇవ్వలేదని.. ప్రజా సమస్యలను, తన సమస్యలను చెప్పుకుందామని వస్తే కనీసం 10 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మండిపడింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గద్దర్ ఉదంతం లాభం చేకూర్చింది.. దీనిపై నాడు కౌంటర్ ఇవ్వడానికి భారత రాష్ట్ర సమితికి అవకాశం లేకుండా పోయింది. గద్దర్ ఎపిసోడ్ నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకోని వరంలాగా మారింది. ఓ వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేందుకు కారణమైంది. చివరికి అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిపించినప్పటికీ.. నాటి ప్రభుత్వానికి ఆ గుర్తింపు దక్కకుండా పోయింది.
ఇప్పుడు కాంగ్రెస్ వంతు
గద్దర్ మాదిరిగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విప్లవోద్యమాలకు గుమ్మడి నరసయ్య కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. ఇప్పటికీ ఆయన నిరాడంబర జీవితాన్ని గడుపుతుంటారు. ఐదుసార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య.. గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో నిలబడినప్పటికీ ఓటమి పాలయ్యారు.. ఈ క్రమంలో గుమ్మడి నరసయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి హైదరాబాద్ వచ్చారు. ప్రజా సమస్యలను చెప్పడానికి.. రైతు భరోసా, వ్యవసాయ రుణాలు మాఫీ కాకపోవడంతో ఆ విషయాలను వెల్లడించడానికి ఆయన వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద చాలాసేపు ఎదురు చూశారు. అయినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగలేదు. అయితే ఈ విషయం నిన్నటి నుంచి మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది. గులాబీ సెక్షన్ మీడియా దీనిని ప్రధానంగా ప్రచారం చేస్తోంది. ఒక సెక్షన్ మీడియా కూడా దీనిని హైలెట్ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉండిపోతున్నారు. నాడు గద్దర్ విషయంలో హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఈ విషయంలో మాత్రం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.. అయితే ఇదే అదునుగా గులాబీ మీడియా రెచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కావలసినంత బురద చల్లుతోంది. ఆ కాడికి కెసిఆర్ ఏదో అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు.. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ కలిసినట్టు.. చివరికి హోంశాఖ మంత్రిని కూడా గేటు అవతల నుంచే పంపించిన ఘనత కేసిఆర్ ది. అలాంటి చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోయారని గులాబీ నేతలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ ప్రజాస్వామ్యతంగా వ్యవహరించారు తెలుసా.. అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు తెలుసా అనే కోణంలో వార్తలను ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతోంది. చేయని పని కూడా చేసినట్టు గులాబీ సెక్షన్ మీడియా చెప్పుకుంటున్నది. కానీ ఇక్కడ కౌంటర్ ఇవ్వడానికే కాంగ్రెస్ కు చేతకావడం లేదు.