HomeతెలంగాణMarriage: బంధువు మృతితో మ్యారేజ్ రద్దు చేసిన వరుడు.. పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ..

Marriage: బంధువు మృతితో మ్యారేజ్ రద్దు చేసిన వరుడు.. పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ..

Marriage: ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో ఉన్నాం. సాంకేతికతను విపరీతంగా ఉపయోగిస్తున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ ముందుకు సాగుతున్నాం. ఇవి పెద్దలతో పాటు కొందరు చెప్పే మాటలు. వారు చెప్పినట్లుగా మనం టెక్నాలజికల్ వరల్డ్‌లో ఉన్న మాట నిజమే. కానీ, ఇంకా కొందరిలో మూఢ నమ్మకాలు బలంగా పాతుకుపోయి ఉన్నాయి. ఈ విషయం చెప్పేందుకు తాజాగా జరిగిన ఘటన ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇంతకీ ఏం జరిగింది.. బంధువు మృతి చెందితే వరుడు పెళ్లి ఎందుకు ఆపాడు అనే విషయాలపై ఫోకస్..

Marriage
Marriage

పెళ్లంటే నూరేళ్ల బతుకు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అమ్మాయి పెళ్లి చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ఎంతలా తాపత్రయపడుతుంటారో అందరికీ తెలుసు. అంగరంగ వైభవంగా అమ్మాయిని ఓ ఇంటి దానిని చేయాలని అనుకుంటారు. అలా తమ కూతురి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులకు వరుడు షాక్ ఇచ్చాడు. వధువు తరుఫు బంధువుల్లో ఓ మహిళ మృతి చెందడమే ఇందుకు కారణమయింది. పూర్తి వివరాల్లోకెళితే.. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం చెద్లాపూర్ విలేజ్‌కు చెందిన కిషన్ అనే యువకుడితో కొమరవెల్లి గ్రామానికి చెందిన యువతితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు.

మ్యారేజ్ చేసేందుకు బంధువులను పిలవడంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఓ విషాదం జరిగింది. అయితే, అది వధువు కుటుంబంలోనో వరుడి కుటుంబంలోనో కాదు. వధువు తరఫు బంధువుల్లో ఒక మహిళ చనిపోయింది. ఆ విషయం వరుడితో పాటు వారి బంధువులకూ తెలిసింది. విషయం తెలిసిన వధువు కుటుంబ సభ్యులు ఇంటి వద్ద కాకుండా పెళ్లి వేదికను టెంపుల్‌కు మార్చారు. అయితే, ఇక్కడ వరుడు మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

Also Read: Parents: పిల్లలు ఫోన్ తరచూ వాడకుండా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఇదే

మ్యారేజ్ టైంలో వధువు తరఫున బంధువుల చనిపోవడం వలన తాను సదరు యువతిని పెళ్లి చేసుకోబోనని, అలా చేసుకుంటే తమకు కీడు జరుగుతుందని అన్నాడు. దాంతో అమ్మాయి తరఫు బంధువులు పెళ్లి అని చెప్పి మధ్యలో ఆగిపోతే బాగోదని, అలా ఏం జరగదని పెళ్లి చేసుకోవాలని వరుడిని బతిమాలారు. అయితే, వధువు తరఫు వారు ఎంత వేడుకుంటున్నప్పటికీ వరుడు వినలేదు. దాంతో వధువు తరఫు వారు వరుడిపై చేయి చేసుకున్నారు. దాంతో ఆ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారు కూడా వరుడిని ఒప్పించే ప్రయత్నం చేశారు. పెళ్లి మధ్యలో ఆగిపోతే వధువు పరిస్థితి, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని వరుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఎవరూ చెప్పినా వరుడు వినలేదు.

పోలీసులు వరుడిపై కేసు నమోదు చేశారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఇబ్బందులు మరెవరికి రాకూడదని వాపోయారు.

Also Read: Sinful Birth: పాపాలతోనే పాడు జన్మలు సంప్రాప్తిస్తాయా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular