https://oktelugu.com/

Amrapali: హడలెత్తించిన ఆమ్రాపాలి.. నయా డ్యూటీ వైరల్

జీహెచ్‌ఎంసీ పరిధిలో శానిటేషన్‌ గురించి తెలుసుకునేందుకు అమ్రపాలి పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్‌నగర్‌ రైతుబజార్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 4, 2024 / 04:26 PM IST

    Amrapali

    Follow us on

    Amrapali: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అమ్రపాలి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి అమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్‌ ఐఏఎస్‌లకు సూచించారు. ఈ నేపథ్యంలో అమ్రపాలీ ఆన్‌ డ్యూటీలో భాగంగా అధికారులతో కలిసి నారాయణగూడలోని గల్లీల్లో పర్యటించి గురువారం పర్యటించారు. వివిధ పనులను పరిశీలించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

    శానిటేషన్‌పై కీలక ఆదేశాలు..
    జీహెచ్‌ఎంసీ పరిధిలో శానిటేషన్‌ గురించి తెలుసుకునేందుకు అమ్రపాలి పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్‌నగర్‌ రైతుబజార్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వీధులు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిత్యం చెత్త తొలగించాలని సూచించారు. గార్బేజ్‌ వల్బరేబుల్‌ పాయింట్‌ తొలగింపుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని తెలిపారు. స్థానికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

    విద్యార్థులతో మాటామంతి..
    తనిఖీల సందర్భంగా పలువురు విద్యార్థులతో అమ్రపాలి ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మర్కెట్‌ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జేసీని ఆదేశించారు. శంకర్‌మఠ వద్ద రాంకీ ఆర్‌ఎఫ్‌సీ వెహికల్‌ డ్రైవర్‌తో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో విద్యార్థినిని కలిసి పరిశుభ్రతపై కమిషనర్‌ అవగహన కల్పించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.