Electricity Bills: కొత్త నిబంధనల బాధ వద్దు.. ఆన్ లైన్ లో కరెంట్ బిల్లులు ఇలా చెల్లించండి..

పేమెంట్ యాప్స్ లో బిల్లుల స్వీకరణ నిలిపివేసినప్పటికీ..ఆన్ లైన్ లో విద్యుత్ బిల్లు చెల్లించవచ్చు.. ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ కు బదులుగా హెల్ప్ డెస్క్ ద్వారా విద్యుత్ శాఖ బిల్లులు స్వీకరిస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 4, 2024 4:22 pm

Electricity Bills

Follow us on

Electricity Bills: పేమెంట్ యాప్స్ తెరపైకి రావడంతో మొన్నా నిన్నటి వరకు విద్యుత్ బిల్లులను ఆన్ లైన్ లో చెల్లించేందుకు అవకాశం ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా నిబంధనలను విధించింది. దీని ప్రకారం యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులకు అవకాశం లేకుండా పోయింది. జూలై 1 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.. ఈ సమయంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు ఎలా చేయాలో తెలియక చాలామంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

పేమెంట్ యాప్స్ లో బిల్లుల స్వీకరణ నిలిపివేసినప్పటికీ..ఆన్ లైన్ లో విద్యుత్ బిల్లు చెల్లించవచ్చు.. ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ కు బదులుగా హెల్ప్ డెస్క్ ద్వారా విద్యుత్ శాఖ బిల్లులు స్వీకరిస్తుంది. ఉదాహరణకు తెలంగాణ పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులు TGSPDCL యాప్ లేదా అధికారిక సైట్ https:// tgsouthernpower.org ద్వారా నేరుగా బిల్లులు చెల్లించవచ్చు. ఈ సైట్ లేదా యాప్ నుంచి యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసి కరెంట్ బిల్లును చెల్లించవచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్ వినియోగదారులైతే APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్ సైట్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.. దీనికోసం సైట్ లేదా యాప్ లో పే యువర్ బిల్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం బిల్ చెల్లించాలి.. ఒకవేళ వెబ్ సైట్ నుంచి బిల్లు చెల్లించాలంటే bill desk అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.. అందులో యూనిక్ సర్వీస్ నెంబర్, క్యాప్చా నంబర్ నమోదు చేయగానే.. బిల్లు వివరాలు మొత్తం వస్తాయి. చెల్లింపు కోసం క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ వాలెట్, యూపీఐ యాప్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు. జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు కార్యరూపం దాల్చాయి కాబట్టి.. తెలుగు రాష్ట్రాలలో కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ఇకపై ఈ పద్ధతినే అనుసరించాల్సి ఉంటుంది.