https://oktelugu.com/

డిటెక్టివ్‌ ఉద్యోగాలంటూ అమ్మాయిలకు ఎర

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపోతున్న వారు ఉన్నంత కాలం.. వారు మోసం చేస్తూనే ఉంటారు. పేపర్లలో ఎన్ని ఉదంతాలు చూస్తున్నా.. టీవీల్లో నిత్యం ఎన్ని వార్తలు వింటున్నా.. అక్రమార్కుల చేతుల్లో బలవుతూనే ఉన్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొత్త దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ ఉదంతం సంచలనంగా మారింది. లేడీ డిటెక్టివ్ ఉద్యోగం అంటూ యువతులకు ఎర వేయటం.. అందమైన యువతుల్ని ట్రాప్‌లోకి దింపడమే ఈ ముఠా పని. దీనిపై ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 09:01 AM IST

    Job Cheated girls

    Follow us on


    ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపోతున్న వారు ఉన్నంత కాలం.. వారు మోసం చేస్తూనే ఉంటారు. పేపర్లలో ఎన్ని ఉదంతాలు చూస్తున్నా.. టీవీల్లో నిత్యం ఎన్ని వార్తలు వింటున్నా.. అక్రమార్కుల చేతుల్లో బలవుతూనే ఉన్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొత్త దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ ఉదంతం సంచలనంగా మారింది. లేడీ డిటెక్టివ్ ఉద్యోగం అంటూ యువతులకు ఎర వేయటం.. అందమైన యువతుల్ని ట్రాప్‌లోకి దింపడమే ఈ ముఠా పని. దీనిపై ఇప్పుడు రాచకొండ పోలీసులు ఫోకస్ పెట్టారు.

    Also Read: సామాజిక, మతపరమైన విద్యా అసమానతలు

    ఈ దందాకు కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న రామకృష్ణ.. తానో ప్రముఖ మీడియాలో ఉన్నత హోదాలో ఉన్నట్లు చెప్పుకుంటూ అమ్మాయిలకు ఎర వేస్తూ ఉంటాడు. డీజీపీ మొదలు పోలీస్‌ బాస్‌లంతా తనకు తెలుసని.. మంత్రి కేటీఆర్‌‌ కూడా క్లోజేనని ట్రాప్‌ చేస్తుంటాడు. అన్నింటికీ తెగించాలని.. అర్ధరాత్రిళ్లు రమ్మన్నా రావాలని.. పనితనం చూపిస్తే సినిమా ఛాన్స్‌లూ వస్తాయని చెబుతుంటాడు.

    తాజాగా.. రామకృష్ణ చెప్పుకొని తిరుగుతున్న ఆ మీడియాకే ఈ విషయం తెలిసింది. దీంతో స్వయానా రంగంలోకి దిగి స్టింగ్‌ ఆపరేషన్‌ షురూ చేసింది. తమ సంస్థ నుంచి ఇద్దరు యువతులను రామకృష్ణ వద్దకు డిటెక్టివ్‌ ఉద్యోగాల కోసం పంపారు. రిస్క్‌ ఉంటుందని.. ఏదైనా జరిగే తనకు బాధ్యత లేదంటూ.. నెలవారీ జీతాలను ఇవ్వలేమని.. పని చేసిన రోజులకే డబ్బులు ఇస్తామని చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా.. బుజ్జి అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. అతను సినిమా డైరెక్టర్ అంటూ మహిళలకు పరిచయం చేశాడు. ఆ బుజ్జికి మాత్రం ఆ ఇద్దరు అమ్మాయిలు తన అసిస్టెంట్లు అని.. లేడీ డిటెక్టివ్‌లుగా పనిచేస్తున్నారని పరిచయం చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అప్పటికి ఆ ఇద్దరు మహిళలు ఇంకా జాబ్‌లో జాయిన్‌ కూడా కాలేదు. ఇంతకీ ఈ బుజ్జి ఎవరన్న విషయాన్ని ఆరా తీస్తే రామకృష్ణతో కలిసి అతగాడు మహిళల్ని మోసం చేసే వ్యక్తి అని వెల్లడైంది.

    Also Read: భూతగాదాలు, రిజిస్ట్రేషన్ కష్టాలు ఉండవిక

    అర్ధరాత్రిళ్లు రమ్మన్నా రావాలని.. తానో బేసిక్ ఫోన్.. సిమ్ కార్డు ఇస్తానని.. తాను చెప్పే మగాళ్లకు ఫోన్లు చేసి.. ట్రాప్ చేయాలని చెప్పాడు. చీరలు.. పంజాబీ డ్రస్‌లు కాకుండా మోడ్రన్‌ డ్రెస్సులు వేసుకోవాలని వారికి చెప్పాడు. ఇదంతా దందా నడిపిస్తున్న ఈ రామకృష్ణ ఎవరు..? అతని బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి..? ఇలా ఎంత మందిని ట్రాప్‌ చేసి బుజ్జికి అప్పజెప్పాడు..? ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? అనే విషయాలపై ఇప్పుడు రాచకొండ పోలీసులు విచారిస్తున్నారు.