అధికారుల అలసత్వంతో ఇక ప్రజలకు పనిలేదు. ఆలస్యానికి అవకాశం లేదు. అధికారులకు మామూళ్లు లేవు. మన భూమి. మన పైసలు సేఫ్. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం అవినీతి లేని రెవెన్యూ వ్యవస్థకు పురుడుపోసింది. ఈ మేరకు ప్రజలంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
Also Read: సామాజిక, మతపరమైన విద్యా అసమానతలు
ఇక రెవెన్యూ వ్యవస్థ రద్దు చేసిన కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ వేతనం ప్రకటించడం.. వీఆర్వోలను వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తాననడంతో వారిలోనూ ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి. దీంతో ఒకే దెబ్బకు చాలా పిట్లలు కొట్టారని ప్రజలంతా సంతోష పడుతున్నారు..
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టిన బిల్లుతో సగం అవినీతిని రూపు మార్చాడనే చెప్పొచ్చు. ఇన్నాళ్లు భూ క్రయవిక్రయాలంటే లక్షలు లంచంగా ఇవ్వాల్సి వచ్చేది. పేదలైనా సరే.. అధికారులకు వేలల్లో సమర్పించాల్సిందే. ఇక రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మన పేరు మీద మ్యుటేషన్ కావాలంటే ఎంతో ప్రయాస.. వీఆర్వో నుంచి ఆర్ఐ, తహసీల్దార్ వరకు రేటు పెట్టుకొని వసూలు చేసేవారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ఇప్పుడు అన్ని కష్టాలకు స్వస్తి పలికింది.
ఇక నుంచి తెలంగాణలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లు పూర్తయ్యేలా కొత్త చట్టం అవకాశం కల్పిస్తోంది. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ అయ్యాక మ్యూటేషన్ కోసం లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ కాగానే దానంతట అదే మ్యూటేషన్ అయ్యేలా కొత్త చట్టం మార్పులు తెచ్చారు.
Also Read: అక్బరుద్దీన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్
కొత్త చట్టంలో వ్యవసాయ భూములే కాదు.. ఆస్తులు, భూమి, స్థలం, ఇల్లు , ఫ్లాటు ఏది కొన్నా రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ పూర్తి చేసి కొనుగోలుదారులకు యాజమాన్య హక్కుల పత్రం చేతికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖలో అవినీతికి కేసీఆర్ చరమగీతం పాడాడు. ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూతగాదాల పీడకు శాశ్వతంగా ముగింపుపలికాడు. ప్రజల్లో దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.