Homeఎంటర్టైన్మెంట్Garikapati - Chiranjeevi Controversy: గరికపాటి – చిరంజీవి వివాదం.. మనకు ఏం నేర్పింది!

Garikapati – Chiranjeevi Controversy: గరికపాటి – చిరంజీవి వివాదం.. మనకు ఏం నేర్పింది!

Garikapati – Chiranjeevi Controversy: దసరా పండుగ మరుసటి రోజు హర్యాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో పార్టీలకు అతీతంగా అలయ్‌ – బలయ్‌ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా ప్రశంసించారు. మన సంస్కృతి, సంప్రదాయాన్ని అందరికీ తెలియజేయాలన్న దత్తాత్రేయ ఆకాంక్ష చాలా గొప్పదన్నారు. వివాద రహితుడిగా ఉన్న దత్తాత్రేయ నిర్వహించే ఈ అలయ్‌ – బలయ్‌ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులతోపాటు వివిధ శాఖల అధికారులు కూడా హాజరవుతారు. ఈ ఏడాది మెగాస్టార్‌ చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. ఆయనతోపాటు వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పండితులు, బహుభాషా కోవిదులు, వీఐపీలు, వీవీఐపీలు హాజరయ్యారు.

Garikapati - Chiranjeevi Controversy
Garikapati – Chiranjeevi Controversy

చిరంజీవి ఫొటో షూట్‌..
ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్‌ – బలయ్‌ కార్యక్రమానికి చిరంజీవికి తొలిసారిగా దత్తాత్రేయ నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా చెప్పారు. ఎంతో మంచి కార్యక్రమానికి ఇన్నేళ్లుగా తనను ఎందుక ఆహ్వానించడం లేదనుకున్నానని, కానీ ఆ సమయం తన సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన మరుసటి రోజే రావడం సంతోషంగా ఉందని అలయ్‌ – బలయ్‌ కార్యక్రమంలోనే ప్రకటించారు. అయితే తొలిసారిగా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవిని చూసేందుకు కార్యక్రమానికి వచ్చిన మహిళలు ఆసక్తి కనబర్చారు. ఆయనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న మెగాస్టార్‌ కూడా ఎవరినీ నొప్పించాలనుకోలేదు. ఎక్కడైనా హుందాగా వ్యవహరించే చిరంజీవి అలయ్‌ – బలయ్‌ కార్యక్రమంలోనే అంతే హుందాగా, గౌరవంగా వ్యవహరించారు. అంతపెద్ద కార్యక్రమంలో అంతమంది వీఐపీలు, వీవీఐపీలు ఉన్నప్పటికీ అభిమానులు తన వద్దకు రావడంతో అందరితో కలిపిసోయారు. ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కూడా నిరాకరించలేదు.

గరికపాటి వ్యాఖ్యలతో..
అయితే అలయ్‌ – బలయ్‌ కార్యాక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహారావు సైతం హాజరయ్యారు. పెద్దలందరూ అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఆసినులై ఉన్నారు. అయితే చిరంజీవి మాత్రం అభిమానుల మధ్య ఉండిపోయారు. ఉండాల్సి వచ్చింది. చిరంజీవి వేదికపైకి రాకుండా అభిమానులతో ముచ్చటించడం, ఫొటోలు దిగడం గమనించిన గరికపాటి కొంత అసహనానికి లోనయ్యారు. ‘చిరంజీవిగారు ఫొటో సెషన్‌ ఆపాలి.. దయచేసి వేదికపైకి రావాలి.. లేదంటే తనకు సెలవు ఇప్పించాలి’ అని అన్నారు. అయితే అభిమానుల కోలాహాలం మధ్య మెగాస్టార్‌ ఈ వ్యాఖ్యలను గమనించలేదు. అయితే ఎవరో ఆయనకు సందేశం పంపడంతో వెంటనే మెగాస్టార్‌ అభిమానులకు నచ్చజెప్పి వెంటనే వేదికపైకి వెళ్లి గరికపాటి నర్సిహారావు పక్కనే కూర్చురున్నారు. గరికపాటి గురించి గొప్పగా కూడా చెప్పి తన హుందాతనాన్ని మరోమారు చాటుకున్నారు.

అభిమానుల కాంట్రవర్సీ..
అయితే చిరంజీవి అభిమానులు గరికపాటి వ్యాఖ్యలపై నొచ్చుకున్నారు. చిరంజీవి కూడా గరికపాటి వ్యాఖ్యలను విభేదించలేదు. కానీ మెగాస్టార్‌ అభిమానులు మాత్రం గరికపాటి వ్యాఖ్యలను తప్పు పడుతూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు. గరికపాటి అభిమానులు కూడా అంతేస్థాయిలో చిరు అభిమానుల విమర్శలను తిప్పికొట్టడం ప్రారంభించారు. ఇందులోకి మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఎంటర్‌ కవడంతో చిరంజీవి అభిమానులు మరింత రెచ్చిపోయారు. దీంతో అటు మెగాస్టార్, ఇటు గరికపాటి జరుగుతున్న నష్టాన్ని గమనించారు. ఈ వివాదానికి ముగింపు పలకలని నిర్ణయించుకున్నారు. దీంతో మొదట గరికపాటి స్పందిస్తూ తాను దొందరపడ్డాడని, అలయ్‌ – బయల్‌ కార్యాక్రమంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా కోరారు. చిరంజీవి కూడా స్పందిస్తూ.. పెద్దలు గరికపాటిగారు చేసిన వ్యాఖ్యలకు తానేమీ నొచ్చుకోలేదని, గొప్ప ప్రవచన కర్త అయిన గరికపాటి మాటలను తప్పు పట్టొద్దని కోరారు. మెగా సోదరుడు నాగబాబు కూడా తాము గరికపాటి నుంచి క్షమాపణలు కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో వివాదానికి ముగింపు పలికారు.

Garikapati - Chiranjeevi Controversy
Garikapati – Chiranjeevi

అభిమానులుగా మనం ఏం నేర్చుకోవాలి..
మెగాస్టార్‌ చిరంజీవి, ప్రవచన గరికపాటి నర్సింహారావు ఇద్దరూ గొప్ప వ్యక్తులే. వారివారి రంగాల్లో నిష్ణాతులు ఇందులో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవిని చూస్తే గరికపాటికి అసూయ అనడంలో అర్థం లేదు. ఎందుకంటే చిరంజీవి రంగం వేరు.. గరికపాటి రంగం వేరు ఏ రకంగానూ ఇద్దరూ ఒకరికి ఒకరు పోటీ కాదు. అయితే ఎంత గొప్ప ప్రవచనకర్త అయినా గరికపాటి కూడా మనిషే. ఆయన ఏదో ఆవేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించింది. తర్వాత తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు కూడా చిరంజీవి కూడా గరికపాటికి గౌరవం ఇచ్చి తన పెద్దమనసు చాటుకున్నారు. ఇద్దరికీ అభ్యంతరం లేనప్పుడు అభిమానులుగా మనం ఆవేశానికి లోనుకావడం, విమర్శలు చేయడంలో అర్థం లేదు. ఏ వ్యాఖ్యలనైనా ఖండించేటప్పుడు.. ఎవరినైనా తప్పు పట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular