https://oktelugu.com/

Ganesh Immersion: నేడు గణేష్ నిమజ్జనం.. ఏర్పాట్లు, ట్రాఫిక్ నిషేధాలు.. రూట్ మ్యాప్

Ganesh Immersion: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రతిమలు వెళ్లే రోడ్లలో ముందస్తుగా ప్రణాళిక ప్రకారం నిబంధనలు విధించారు. దీంతో విగ్రహాల రాకకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. నిమజ్జనం ఆదివారం కావడంతో సెలవున్నందున పెద్ద ఎత్తున జనం రానున్నారు. దీంతో అధికారులు వారికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు నిన్నటి నుంచే కొనసాగిస్తున్నారు. రోడ్లన్ని పోలీసుల […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 19, 2021 / 10:29 AM IST
    Follow us on

    Ganesh Immersion: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రతిమలు వెళ్లే రోడ్లలో ముందస్తుగా ప్రణాళిక ప్రకారం నిబంధనలు విధించారు. దీంతో విగ్రహాల రాకకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. నిమజ్జనం ఆదివారం కావడంతో సెలవున్నందున పెద్ద ఎత్తున జనం రానున్నారు. దీంతో అధికారులు వారికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు నిన్నటి నుంచే కొనసాగిస్తున్నారు. రోడ్లన్ని పోలీసుల ఆధ్వర్యంలో రవాణా నిబంధనలతో ప్రయాణికులకు అనుమతులు ఇస్తున్నారు.

    ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలుస్తోంది. గణేష్ శోభాయాత్ర రూట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నిషేధించారు. దీంతో నగరంలో రహదారులన్ని ప్రతిమలతో నిండిపోతున్నాయి. విగ్రహాల తరలింపులో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకే ఏర్పాట్లు పూర్తి చేశారు.

    బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర ఫలక్ నూమా నుంచి వచ్చే శోభాయాంత్రను చార్మినార్, అఫ్జల్ గంజ్, గౌలిగూడ, చమన్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్, బషీర్ బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ ద్వారా తరలించనున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర కోసం ఆర్పీ రోడ్ మీదుగా కర్పాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్, జంక్షన్ లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ ద్వారా మళ్లించారు. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్రను రామాంతపూర్, అంబర్ పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగిస్తున్నారు.

    దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చే ప్రతిమలను సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా పంపిస్తున్నారు. టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్రను మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లించారు. మెహదీపట్నం, తప్పావబుత్రా, ఆసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభాయాత్రను సీతారాంబాగ్, బోయగూడ కమాన్, గోషామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా వస్తున్నాయి. మరోవైపు ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా చేరుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ఈ రూట్ లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తాయని పోలీసులు చెబుతున్నారు. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షిస్తున్నారు. దీంతో శోభాయాత్ర ముగిసే వరకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.