Hyderabad luxury apartments: హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్ మాత్రమే గుర్తుకు వచ్చేది. ఆ తర్వాత ట్యాంక్ బండ్.. బుద్ధుడి విగ్రహం.. ఇలా రకరకాల ఐకానిక్ సింబల్స్ వచ్చేసాయి. ఇప్పుడైతే దుర్గం చెరువు వంతెన.. పెద్దపెద్ద ఆకాశ హర్మ్యాలు సరి కొత్తగా చోటుచేసుకున్నాయి. మై హోం, తాజాగా అరబిందో ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తున్నాయి. పెద్దపెద్ద అపార్ట్మెంట్స్ కట్టి.. వాటిలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించి దుమ్మురేపే రేంజ్ లో విక్రయిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని గగ్గోలు పెడుతుంది. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే అరబిందో ఫార్మా కట్టిన కోహినూర్ అపార్ట్మెంట్స్ లో ఒక్క ఫ్లాట్ విలువ దాదాపు 6 కోట్లు.. దాని పక్కనే యశోద హైటెక్ సిటీ బ్రాంచ్ ఉంటుంది. కోహినూర్ అపార్ట్మెంట్లోని 25వ అంతస్తుకు వెళ్లి చూస్తే హైదరాబాదు నగరం మొత్తం సగం కనిపిస్తూ ఉంటుంది.
ఒకప్పుడు ముంబై, గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లోనే అపార్ట్మెంట్లకు బీభత్సంగా రేట్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా హైదరాబాద్ ముందు జుజుబి అయిపోయాయి. చివరికి అంతటి ట్రంప్ కూడా హైదరాబాదులోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అంటే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. విస్తారంగా భూములు.. నడ మంత్రపు సిరికి సంకేతంగా కొత్త కొత్త ఉద్యోగాలు.. అంతకుమించి అనే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు.. ఇవన్నీ కలగలిసి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సరికొత్త వైపుగా తీసుకెళ్తున్నాయి. ఇది ఎంతవరకు వెళుతుంది.. ఎక్కడి వరకు దారి తీస్తుంది.. ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు.
వాస్తవానికి ఇంతటి ఖరీదైన ఆకాశ హర్మ్యాలలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. కోట్లకు పడగలెత్తిన వారు నివాసం ఉంటారు. కానీ అందులో పాత్రికేయులకు స్థానం ఉంటుందా? ఈ ప్రశ్నకు ఉంటుందనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పాత్రికేయులు కూడా రాజకీయ నాయకులను మించిపోయారు. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డారు. నీరా రాడియా ను మించి లాబీయింగ్ చేస్తున్నారు. అందువల్లే కోట్లకు కోట్లు సంపాదించి ఈ స్థాయికి ఎదుగుతున్నారు. అరబిందో ఫార్మా కంపెనీ కోహినూర్ అపార్ట్మెంట్లను నిర్మించిన నేపథ్యంలో.. అందులో ఉన్న ప్లాట్లు హాట్ కేకుల మాదిరిగా అమ్ముడు పోయాయట. ఇదే ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు అరబిందో కంపెనీ రెడీ అయిందట. ఫార్మా కంపెనీ కంటే ఇందులోనే ఎక్కువగా లాభాలు వస్తూ ఉండడంతో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్లాట్లు కట్టాలని నిర్ణయించిందట. ఎంతైనా హైదరాబాద్ చాలా గ్రేట్.. ఎందుకంటే ఇప్పుడు చాలా రిచ్ అయిపోయింది. ఇక్కడ పుట్టి.. ఇక్కడ పెరిగిన వారికి దూరమైపోయింది.. ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిన వారికి బాగా దగ్గర అయిపోయింది. ఎందుకంటే అదంతా డబ్బు మహిమ.