Viral video : మనకంటే పెద్దవాళ్లు ఎదురైనప్పుడు నమస్కారం పెడతాం. వారు గొప్పవారు అయినప్పుడు పాదాలకు నమస్కరిస్తాం. బహుశా ప్రపంచంలో ఈ సంస్కృతి మనదేశంలో తప్ప ఎక్కడా ఉండదు. గొప్ప వాళ్ల ముందు తాము చిన్న వాళ్ళమని.. వారి ఆశీస్సులు ఉండాలని కాళ్లకు నమస్కరించి దీవెనలు పొందుతారు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ వయసులో చిన్నవారి కాళ్ళ మీద పడటం గొప్పతనం అనిపించుకోదు. పైగా అది అతి వినయానికి పరాకాష్టలాగా దర్శనమిస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారురాలు అని ఆరోపణలు ఎదుర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో అరెస్టుకు గురై.. ఐదు నెలలపాటు ఢిల్లీలోని టీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజు ఆమె హైదరాబాద్ వచ్చారు. తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు. అనంతరం తర్వాతి రోజు తన తండ్రి కేసీఆర్ను యరవల్లి ఫామ్ హౌస్ లో కలుసుకున్నారు. విలాసవంతమైన కారులో తన భర్తతో కలిసి ఆమె వచ్చారు. ఆమె తన తండ్రి ఉన్న భవనంలోకి వెళ్లే క్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తారసపడ్డారు. మరో మాటకు తావు లేకుండా కవిత కాళ్లకు నమస్కరించారు. వయసు పరంగా చూసుకుంటే కవిత కంటే జీవన్ రెడ్డి పెద్ద.. కానీ అవన్నీ పక్కనపెట్టి జీవన్ రెడ్డి ఆమె కాళ్ళ మీద పడి నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది..
సామాజిక మధ్యమాలలో పోస్ట్ చేశారు
ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశారు. దీంతో జీవన్ రెడ్డి వ్యవహార శైలి ఒకసారిగా చర్చకు దారి తీసింది..”పూర్వపు రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఉండేది. గత పది సంవత్సరాలుగా కాళ్ళ మీద పడే విధానానికి శ్రీకారం చుట్టారు. అప్పుడంటే కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి కాళ్ల మీద పడ్డా.. ఇప్పుడు అధికారంలో కూడా లేడు కదా.. పైగా ఆమె కూతురు ఎంపీగా ఓడిపోయింది. మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోయింది. ఏకంగా ఐదు నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి.. చివరికి ముకుల్ రోహత్గీ లాంటి కాస్ట్లీ న్యాయవాదిని పెట్టుకొని భారీగా డబ్బు ఖర్చు చేస్తే బెయిల్ వచ్చింది. అలాంటి మహిళ కాళ్లపై పడటం ఏంటి? ఇది ఎంతవరకు సరైనది” అంటూ నెటిజన్లు జీవన్ రెడ్డి తీరును ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.
స్వాధీన ప్రక్రియ ఆగిపోయింది
గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు… ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని మల్టీప్లెక్స్ నిర్మించారు. అయితే ఆర్టీసీకి ఏమాత్రం బకాయిలు చెల్లించలేదు. అప్పట్లో ఆయన పై ఆరోపణలు వచ్చినప్పటికీ భారత రాష్ట్ర సమితి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేసింది. కొద్దిరోజులపాటు జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్ కు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసింది.. అయితే అప్పట్లో ఆయననుంచి ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ స్వాధీన ప్రక్రియ ఆగిపోయింది.
A Jeevan Reddy’s behaviour is eyesore… No wonder Armoor rejected him
Don’t even try to defend this sycophancy… from what I know of MLC Kavitha, she wouldn’t even ask for such things. pic.twitter.com/8YoXMUzQtr
— Naveena (@TheNaveena) August 29, 2024