La Rose Noir Car : సొంతంగా కారు ఉంటే దూర ప్రయాణం దగ్గరవుతుంది అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నా కారులో ప్రయాణించవచ్చు. అందుకే చాలా మంది ఈ రోజుల్లో కారును కొనుగోలు చేస్తున్నారు. కార్యాలయాలు, ఇంటి అవసరాలతో పాటు అప్పుడప్పుడు విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారు వారికి అనుగుణంగా కార్లు ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. హ్యాచ్ బ్యాక్ నుంచి ఖరీదైన కార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ కారు మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారు ధర ఎలా ఉందంటే? మనదేశంలో అంబానీ కూడా దీనిని కొనడానికి ఆలోచిస్తాడట. ఇంతకీ ఆ కారు ధర ఎంతో తెలుసా?
మిడిల్ క్లాస్ కు ఉపయోగపడే హ్యాచ్ బ్యాక్ కార్లు మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. వీటిని కొందరు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపార వేత్తలు సొంతం చేసుకుంటారు. ఖరీదైన కార్లలో ప్రయాణం చేస్తుంటే ఆ మజా వేరే ఉంటుంది. అందుకే కొందరు ధర ఎక్కువైనా కొన్ని కార్లను తెప్పించుకుంటారు. అయితే చాలా వరకు కాస్ట్లీ కార్లు విదేశాల నుంచే ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పడో కారు ధర చూసి కొందరు గుండెలు బాదుకుంటున్నారు. ధనవంతులు సైతం కొనలేని విధంగా ఈ కారు ధర ఉంది. ఇంతకీ ఈ కారులో ఏముంది?
లగ్జరీ కార్లను ఉత్పత్తి చేయడంలో ‘రోల్స్ రాయిస్’ కంపెనీ ముందు ఉంటుంది. యూకెకు చెందిన ఈ కంపెనీ 1998 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కంపెనీ నుంచి మొదటిసారిగా ‘పాంటమ్’ అనే మోడల్ రిలీజ్ అయింది. దీనిని 2017లో ఉత్పత్తిని ప్రారంభించారు. 2018లో మార్కెట్లోకి తీసుకు రావాలని అనుకున్నారు. కానీ 2022 మే 12న లాంచ్ చేశారు. ఆ తరువాత స్పెక్టర్, ఘోస్ట్, కుల్లినాన్ అనే మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి.
రోల్స్ రాయిస్ నుంచి లేటేస్ట్ గా ‘లా రోజ్ నోయిర్ డ్రాప్ టైల్’ అనే మోడల్ ఉత్పత్తి అయింది. దీనిని మార్కట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని బాడీని అత్యుత్తమమైన మెటిరీయల్స్ తో తయారు చేశారు. ఇందులో 6.75 లీటర్ ట్విన్ టర్బో చార్జ్ తో కూడిన వీ 12 ఇంజిన్ ను అమర్చారు. ఈ ఇంజిన్ 565 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. అలాగే 820 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది.
రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్ టైల్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. పాత కాలం సినిమాల్ల లగ్జరీ కార్ల మాదిరిగా ఉన్నా.. దీని స్టైలిస్ కొత్త విధానంగా ఉంటుంది. టాప్ లెస్ కోరుకునేవారికి ఇది సూపర్ కారు అని చెప్వచ్చు. దీనికి ప్రత్యేకమన బ్లాక్ పెయింట్ వేశారు. 5.3 మీటర్ల పొడవు, 2.0 మీటర్ల వెడల్పుతో ఎలక్ట్రిక్ స్పెక్టర్ కంటే చిన్నదిగానే కనిపిస్తుంది. ఇందులో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ పెద్ద విభాగాన్ని కలిగి ఉంటుంది.
ఇక ఈ కారు ధర చూస్తే గుండెలు బాదుకోవడం ఖాయం. ఎందుకంటే దీనిని 30 డాలర్ల కంటే ఎక్కువగా విక్రయించడానికి రెడీగా ఉన్నారు. అంటే రూ.251 కోట్ల పైమాటే అన్నమాట. దీంతో ఈ కారును మనదేశంలోని ధనవంతులు కూడా కొనడానికి ఆలోచిస్తారు. అయితే ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.