HomeతెలంగాణTelangana real estate Pushpa Raj: అప్పుడు కలెక్టర్.. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్లో పుష్ప...

Telangana real estate Pushpa Raj: అప్పుడు కలెక్టర్.. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్లో పుష్ప రాజ్

Telangana real estate Pushpa Raj: ఆయన ఒకప్పుడు కలెక్టర్ గా పని చేశారు. తన తెలివితేటలతో భారీగా భూములు సంపాదించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో విపరీతంగా భూములు కొన్నారు. ఆ భూములు ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు అయ్యాయి. కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రికి ఆయన పాదాభివందనం కూడా చేశారు. కలెక్టర్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఓ రాజకీయ పార్టీలో చేరారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఆయన చేతిలో ఎన్నో కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఓ కాస్ట్లీ ప్రాంతంలో ఎకరం భూమిని ఆయన ఏకంగా 100 కోట్లు పెట్టి కొన్నారు. ఇటువంటి కోట్లు ఆయనకు లెక్క కావు. లెక్కలోకి కూడా రావు. ఇప్పుడు ఏకంగా ఆయన దాదాపు పదికి మించిన ప్రాజెక్టులను చేతుల్లో పెట్టుకున్నారు. తెల్లాపూర్ ప్రాంతంలో 13 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ నిర్మించారు. ఇందులో 1500 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే తెల్లాపూర్లో మరో చోట 24 ఎకరాల్లో బహుళ అంతస్తులు నిర్మించారు. ఇందులో ఏకంగా మూడు వేల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తెల్లాపూర్ ప్రాంతంలో 21 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు. ఇందులో కూడా 3500 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తెల్లాపూర్ ప్రాంతంలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ నిర్మించారు. ఇందులో 500 ప్లాట్లు అందుబాటులో వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన నియో పోలీస్ ఏరియాలో ఏడు ఎకరాలలో బహుళ అంతస్తులు నిర్మించారు. ఇదే ఏరియాలో 8 ఎకరాల విస్తీర్ణంలో 600 ప్లాట్లు నిర్మించారు. నార్సింగి, మంచిరేవుల, కోకాపేట, అత్తాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో దాదాపు ఐదువేల ప్లాట్ల విస్తీర్ణంతో బహుళ అంతస్తులను నిర్మించారు. ఒక రకంగా తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు ఆపర్ణ, మై హోమ్, జనప్రియ వంటి కంపెనీలు నెంబర్ వన్ స్థానంలో ఉండేవి. కానీ ఆ కంపెనీలను ఈ మాజీ కలెక్టర్ కంపెనీ దాటేసింది. హైదరాబాదులోనే దాదాపు పదివేల ప్లాట్ లకు మించిన సామర్థ్యంతో బహుళ అంతస్తులు నిర్మిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే భారీగా భూములను కొనేసింది. ఈ ప్రకారం చూసుకుంటే ఆ మాజీ కలెక్టర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పుష్ప రాజ్ లాగా అవతరించే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.

ఆయన ఒక పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ.. ఇప్పుడు అధికార పార్టీతో దగ్గరగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పైగా అధికార పార్టీలో ఒక కీలక నాయకుడితో ఇటీవల బంధుత్వం కూడా పెంచుకున్నారని సమాచారం. అందువల్లే ఈ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూకుడు కొనసాగిస్తున్నారని.. వేల కోట్లను సులభంగా సంపాదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఈ మాజీ కలెక్టర్ సిద్ధహస్తుడని మార్కెట్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. చూడాలి మరి ఈ మాజీ కలెక్టర్ ఇంకా ఏ స్థాయిలో దూసుకుపోతారో.. ఇంకా ఏ రేంజ్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను తన చేతుల్లో పెట్టుకుంటారో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular