Sri Krishna Janmashtami Celebrations: దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. ఆదివారం హైదరాబాదులోని రామంతపూర్ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో భాగంగా యాదవ కులస్తులు ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. రామంతపూర్ గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ లో ఆదివారం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించారు. సత్యభామ రుక్మిణి సమేత కృష్ణ భగవానుడి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచారు. ఆ రధాన్ని తాళ్లతో లాగుతూ భక్తులు సందడి చేశారు. రథయాత్ర పూర్తి అయిన తర్వాత.. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను, రధాన్ని ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగిలాయి.
విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇందులో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారికి మెరుగైన వైద్యాన్ని అందించడానికి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ నలుగురికి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ తీగల తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఫంక్షన్ హాల్ ప్రాంతంలో విద్యుత్ తీగలు ఉన్నాయి. రథం మీద ఉన్నవారు ఆ తీగలను గమనించలేదు. దీంతో అవి వారికి తగిలాయి. ఆ అయిదురు కూడా ఒకరి పక్కన ఒకరు ఉండడంతో ప్రాణనష్టం చోటుచేసుకుంది. విద్యుత్ తీవ్రంగా ప్రసారం కావడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ రథంలో కొంత దూరంలో ఉన్న వారికి కూడా విద్యుత్ షాక్ తగిలినప్పటికీ.. వారికి గాయాలయ్యాయి.
Also Read: యూట్యూబ్ వీడియో.. చిన్నారి ప్రాణం కాపాడింది..
ఈ ఘటన రామంతపూర్ ప్రాంతంలో విషాదం నింపింది. విద్యుత్ తీగలు తగిలి గాయపడిన వారికి స్థానికంగా ఉన్న యువకులు సిపిఆర్ చేశారు. ఆ తర్వాత వారిని ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. అయితే ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రథయాత్రను ఘనంగా నిర్వహించడంతో పొద్దుపోయింది. సోమవారం తెల్లవారుజామున రామంతపూర్ ప్రాంతంలో వర్షం కురిసిన నేపథ్యంలో రథయాత్రను ముగించి.. రధాన్ని, స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఫంక్షన్ హాల్ లోకి తీసుకొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.. ఈ విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.