Fashion Designer Prathyusha Garimella: ఇటీవల కాలం లో మన సినీ పరిశ్రమ ని విషాద ఛాయలు అలుముకున్నాయి..ఎంతో మంది దిగ్గజ నటీనటులు కొన్ని కారణాల చేత గడిచిన ఈ మూడు నాలుగు ఏళ్లలోనే ప్రాణాలను కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాము..వీళ్ళ మరణ వార్త విని కంటతడి పెట్టనివారు అంటూ ఎవ్వరు లేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇప్పుడు దేశం లోనే టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరైన ప్రత్యూష గారు ఆత్మహత్య చేసుకోవడం పెద్ద కలకలం సృష్టిస్తుంది..హైదరాబాద్ లోని MLA కాలనీ లో తాను రన్ చేస్తున్న బోటిక్ లోనే ఆత్మ చేసుకోవడం సినీ ఇండస్ట్రీ ని శోకసంద్రం లో ముంచేసింది..స్నానపు గదిలో ప్రాణాలు లేకుండా పడిఉన్న ప్రత్యూష గారి మృత దేహాన్ని పోలీసులు స్వాధీన పరుచుకొని ఉస్మానియా ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించారు..చనిపొయ్యే ముందు ఆమె ఒక లేఖ కూడా రాసింది..’నేను కోరుకున్న జీవితం నాకు దక్కలేదు..ఇక ఈ లోకం తో నాకు పనిలేదు’ అంటూ రాసిన ఒక లేఖ ఆమె బంధుమిత్రులకు మింగుడు పడనివ్వకుండా చేసింది.

ప్రత్యూష గారు ఇదివరకు మన సౌత్ ఇండియా లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కి డ్రెస్ డిజైన్లు చేసింది..దీపికా పడుకునే, కీర్తి సురేష్,శృతి హాసన్,శ్రియ, తమన్నా, కాజల్ అగర్వాల్ ఇలా సౌత్ ఇండియా లో చక్రం తిప్పుతున్న స్టార్ హీరోయిన్స్ అందరికి డ్రెస్సులు డిజైన్లు చేసేది ప్రత్యుష గారే..కెరీర్ లో ప్రస్తుతం ఆమెకి ఉన్న డిమాండ్ మరో ఫాషన్ డిజైనర్ కి లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..కాబట్టి ఆమె కెరీర్ పరంగా డౌన్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆత్మ హత్య చేసుకునే సమస్యే లేదు అని ఆమె మిత్రులు మరియు సన్నిహితులు చెప్తున్నారు..అయితే బాలీవుడ్ నుండి వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ప్రత్యూష గారు గత కొంతకాలం నుండి ఒక్క ప్రముఖ బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉన్నారని..ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం లవ్ ఫెయిల్యూర్ కూడా అయ్యుండొచ్చు అని తెలుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి..ప్రస్తుతం పోలీసులు ఈ కేసు పై దర్యాప్తులు చేస్తున్నారు.
