Ravi Prakash: ఆర్.టీవీకి షాకిచ్చిన ప్రభుత్వం.. పరారీలో రవి ప్రకాష్

టీవీ9 ఛానల్ నుంచి వివాదాస్పదంగా రవి ప్రకాష్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఫోర్జరీ కేసుతో ఒక్కసారిగా ఆయనకు ఉన్న పేరు పోయింది. టీవీ9 లో ఫోర్జరీకి పాల్పడ్డారని అలంద మీడియా రవి ప్రకాష్ పై ఫిర్యాదు చేయడంతో ఆయన పేరు మసకబారిపోయింది.

Written By: Dharma, Updated On : June 30, 2024 9:37 am

Ravi Prakash

Follow us on

Ravi Prakash: తెలుగు మీడియాకు ఓ రేంజ్ క్రియేట్ చేసిన జర్నలిస్టుల్లో అగ్రగన్యుడు టీవీ9 రవి ప్రకాష్.సిటీ కేబుల్ లో ఓ సాధారణ రిపోర్టర్ గా ప్రస్థానం ప్రారంభించారు ఆయన. అక్కడ నుంచి జీ టీవీలో,సుప్రభాతంలో రిపోర్టర్గా విధులు నిర్వర్తించారు. తరువాత జెమినీలో బ్యూరో చీఫ్ గా చేశారు. అక్కడ నుంచి బయటకు రావడంతోనే ఆయన స్టామినో బయట ప్రపంచానికి తెలిసింది టీవీ9 అనే చానల్స్ స్థాపించి టాప్ వన్ స్థానంలో నిలిపేందుకు రవి ప్రకాష్ చేసిన కృషి అంతా కాదు. అప్పటివరకు మూస పద్ధతిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా గతిని మార్చిన ఘనత ఆయనదే. వార్తను అందంగా, వీక్షకుడికి ఆకట్టుకునేలా న్యూస్ ప్రజెంట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. టీవీ9 స్ఫూర్తితోనే తెలుగు మీడియాలో చాలా ఛానళ్లు ఆవిర్భవించాయి అనడంలో సందేహం లేదు.

టీవీ9 ఛానల్ నుంచి వివాదాస్పదంగా రవి ప్రకాష్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఫోర్జరీ కేసుతో ఒక్కసారిగా ఆయనకు ఉన్న పేరు పోయింది. టీవీ9 లో ఫోర్జరీకి పాల్పడ్డారని అలంద మీడియా రవి ప్రకాష్ పై ఫిర్యాదు చేయడంతో ఆయన పేరు మసకబారిపోయింది. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, వీడియోలు విడుదల చేయడంతో రవి జీవితంలో చీకటి ఆవహించింది. అయితే ఆర్టివి అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిన రవి ప్రకాష్.. ఇప్పుడిప్పుడే ఆ ఛానల్ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు కూటమి అధికారంలోకి రాబోతుందని స్టడీ చేసి చెప్పారు రవి ప్రకాష్. అప్పట్లోనే ఆయనపై ముప్పేట విమర్శలు ప్రారంభమయ్యాయి. కానీ ఆయన చెప్పినట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్ టి వి ఫెమ్ ఒక్కసారిగా పెరిగింది.

అయితే ఉన్నట్టుండి ఆర్టివి కార్యాలయం పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవి ప్రకాష్ పై ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆఫ్రికాలో వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున డబ్బును హవాలా రూపంలో తరలించారు అన్నది ఆయనపై ఉన్న అభియోగం. ఇప్పుడు ఆర్ టి వి నిర్వహణలో సైతం నగదు సేవలను వినియోగిస్తున్నట్లు ఈడి దృష్టికి వెళ్ళింది. దీంతో ఈడి ఎంటర్ అయినట్లు సమాచారం. తన ఆర్ టి విని ఎలా నడుపుతున్నారు. నగదు లావాదేవీలు చూసి ఈడి అధికారులకు మైండ్ బ్లాక్ అయినట్లు సమాచారం. ఆర్ టి వి నిర్వహణకు సంబంధించి ఎక్విప్మెంట్ కొనుగోలుకు సైతం బిల్లులు లేవు. అన్ని నగదు రూపంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. చివరకు సిబ్బందికి సైతం నెల జీతాలు నేరుగా నగదు రూపంలో అందిస్తున్నట్లు కూడా తేలింది. గత రెండు రోజులుగా గోప్యంగా ఈ విచారణ సాగుతోంది. ప్రస్తుతం రవి ప్రకాష్ పరారీలో ఉన్నట్టు సమాచారం. దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను ఈడి అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది. రవి ప్రకాష్ బినామీలుగా భావించే చంద్రమౌళి అనే వ్యక్తిని ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.