Kishan Reddy : కిషన్‌రెడ్డికి డబుల్‌ ధమాకా.. మినిస్టర్‌ + పార్టీ ప్రెసిడెంట్‌!

తాజా పరిణామాలపైన బండి సంజయ్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపైన.. బండి సంజయ్‌ పని తీరును పలు సందర్భాల్లో ప్రశంసించిన ప్రధాని మోదీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Written By: Raj Shekar, Updated On : July 1, 2023 12:13 pm
Follow us on

Kishan Reddy : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీ సీనియర్‌ నాయకుడు కిషన్‌రెడ్డి డబుల్‌ ధమాకా కొట్టబోతున్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌కు సముచిత ప్రాధాన్యత ఇస్తామని అగ్ర నేతలు చెబుతున్నారు. మరోవైపు అధ్యక్షడిగా బండిని మార్చటంపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోదీ నిర్ణయమే కీలకం.. 
బండి సంజయ్‌పై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు మంచి అభిప్రాయం ఉంది. వారి ఆశీస్సులతోనే ఆయన తెలంగాణలో దూకుడు పెంచారు. ఎవరికీ భయపడకుండా పార్టీకి ఊపు తెచ్చారు. పెద్దల అండదండలు ఉండడంతో ఆయన వ్యతిరేకవర్గం కూడా ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడ ప్రధాని, హోం మంత్రి నిర్ణయం కీలకం కానుంది. ఇదే సమయంలో అధిష్టానం నుంచి డాక్టర్‌ లక్ష్మణ్‌కు పిలుపు రావటం కీలకంగా మారుతోంది.
నాయకత్వ మార్పు ఖాయమే…
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీలో మార్పు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఈమేరకు అధిష్టానం సిద్ధమైంది. పార్టీ బాధ్యతలు బండి సంజయ్‌ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించేందుకు సిద్దమైంది. బండి సంజయ్‌ పైన ఫిర్యాదులు.. పార్టీ నేతల మధ్య విభేదాలు.. మూడేళ్ల పదవీ కాలం ముగింపు వంటి కారణాలతో బండిని మార్చాలని ఆలోచన చేస్తున్నారు.
కిషన్‌రెడ్డికి ఇష్టం లేదా? 
ఇదిలా ఉంటే పార్టీ పగ్గాలు చేపట్టడానికి కిషన్‌రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈమేరకు తాను మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టలేనని అమిత్‌ షాకు చెప్పినట్లు తెలిసింది. అయినా కిషన్‌రెడ్డివైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ పార్టీపైన నిర్ణయాలను ప్రధాని తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
కొత్త ఫార్ములా.. 
ఈ సమయంలో పార్టీ నాయకత్వం కొత్త ఫార్ముల తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యతల కేటాయింపు కిషన్‌రెడ్డి పార్టీ పగ్గాలు.. బండి సంజయ్‌ కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం.. కాదనుకుంటే పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ.. సీనియర్‌ నేత లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలోనే.. శనివారం జరిగే రాష్ట్రాల మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న లక్ష్మణ్‌ను మరో 2–3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది.
కిషన్‌రెడ్డికి అరుదైన అవకాశం.. 
తొలి కేంద్రమంత్రిగా రికార్డ్‌ ఇదే సమయంలో ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార కమిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ సారథ్యం అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. అయితే, తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్‌ను ఎన్నికల సమయంలో తప్పిస్తే పెను సంక్షోభం తప్పదని పలువురు సీనియర్‌ నాయకులు జాతీయ నాయకత్వానికి తేల్చిచెప్పారు. ఇదే విషయమై వారు పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ప్రధానిదే తుది నిర్ణయం బండి అధ్యక్షుడు అయిన తరువాత పార్టీ వరుసగా గెలుస్తూ వచ్చిందని.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మార్పు సమర్థ్దనీయం కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు.
అధ్యక్షుడి మార్పుతోనే సంక్షేభమే.. 
సారథ్య మార్పు జరిగితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంగతేమోగానీ, పార్టీలో ఉన్నవాళ్లు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటారని తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న ఆరుగురు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు తిరిగి అదే పార్టీలోకి వెళ్లడం ఖాయమని అధినాయకత్వానికి స్పష్టం చేస్తూ సీనియర్‌ నేత విజయరామారావు లేఖ రాశారు. తాజా పరిణామాలపైన బండి సంజయ్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపైన.. బండి సంజయ్‌ పని తీరును పలు సందర్భాల్లో ప్రశంసించిన ప్రధాని మోదీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.