AP TG Districts
AP TG Districts: మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించి అంతా నాశనం చేశారు. మన దేశంలో ఉన్న విలువైన వస్తువులు, సహజ వనరులను అక్రమంగా తమ దేశానికి తరలించారు. ఇంతేకాదు, వారు మన దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో మొగల్ చక్రవర్తులు, నిజాం, ముస్లిం రాజుల పాలన నడిచింది. దీంతో మన దేశంలో అనేక ప్రాంతాల పేర్లను వారు మార్చేశారు. ఇక కాలక్రమేణా పలు ప్రాంతాల పేర్లు కూడా మారాయి. అయితే ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలకు ఉన్న పాత పేర్లు, అవి ఎలా వచ్చాయి, తరువాత ఎలా మారాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. బెజవాడ..
– దీన్నే విజయవాడ అంటారని అందరికీ తెలుసు. అయితే బెజవాడ అనే పేరు ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసా..? పూర్వం ఒకప్పుడు కృష్ణవేణి (కృష్ణా నది) బంగాళాఖాతంలో కలవడం కోసం ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆ నదికి పర్వతాలు అడ్డంగా వచ్చాయి. దీంతో ఆమె అర్జునున్ని వేడుకోగా అప్పుడు అర్జునుడు ఆ పర్వతాలకు రంధ్రం(బెజ్జం) చేశాడు. దీంతో ఈ ప్రాంతానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చింది. తరువాత అది బెజవాడగా మారి విజయవాడ అయింది.
2. భావపురి..
ఈ ప్రాంతంలో భావ నారాయణస్వామి ఆలయం ఉంటుంది. అందుకే ఆ ఆలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి భావపురి అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దీన్ని బాపట్ల అని పిలుస్తున్నారు.
3. వాల్తేరు..
– ఇప్పుడు దీన్ని విశాఖపట్నం అని పిలుస్తున్నారు. వైజాగ్ (విశాఖపట్టణం) ను ‘వాల్తేరు‘ అని పిలిచే వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 18వ శతాబ్దం మధ్య కాలంలో, ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్కృతిక, మానవ హక్కుల పరిరక్షకుడు, సామాజిక విప్లవకారుడు వాల్తేరు కు ఉన్న ప్రజల అభిమానం లేదా సమాజంలోని అత్యంత న్యాయ సంబంధమైన ఆలోచనలు, అభిప్రాయాలు విశాఖపట్టణానికి ఈ పేరు ‘వాల్తేరు‘ అని పిలిచారు.
4. గడప..
– పూర్వం ఒకప్పుడు తిరుమల వెళ్లేందుకు ఎవరైనా ఆ ప్రాంతం ద్వారానే వెళ్లేవారట. దీంతో ఈ ప్రాంతం తిరుమలకు ద్వారంగా ఉండేదట. అందుకే దీన్ని గడప అని పిలిచేవారట. అయితే ఇప్పుడు ఇది కడపగా మారింది.
5. గర్తపురి..
– ఈ ప్రాంతం ఘాటుగా ఉండే మిరపకాయలకు ఫేమస్. ఏంటీ.. ఇంకా గుర్తు పట్టలేదా.. అదేనండీ.. గుంటూర్.. ఒకప్పుడు దీన్ని గర్తపురి అని వ్యవహరించేవారు.
6. కోకనాడ..
– డచ్ వారు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఈ ప్రాంతం ద్వారా మన దేశంలో పండే కొబ్బరి కాయలను విదేశాలకు తరలించేవారు. అందుకనే దీన్ని అప్పట్లో కోకనాడ అని పిలిచేవారు. కానీ ఇప్పుడిది కాకినాడ అయింది.
7. కందెనవోలు..
– కందెన అంటే వాహనాలకు పెట్టే గ్రీజు. పూర్వం ఎద్దుల బండ్లకు ఈ ప్రాంతంలో ఉన్న తుంగ భద్ర నది వద్ద గ్రీజు పెట్టేవారు. దీంతో ఈ ప్రాంతానికి కందెనవోలు అని పేరు వచ్చింది. తరువాత అదే కర్నూల్ అయింది.
8. విక్రమ సింహపురి..
– పెన్నా నది పక్కనే ఉంటుంది ఈ ప్రాంతం. ఏంటీ.. ఇంకా గుర్తు పట్టలేదా. అదేనండీ.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నెల్లూరు అని పిలుస్తున్నారు. గుర్తుకు వచ్చిందా. ఒకప్పుడు దీన్ని విక్రమ సింహపురి అని పిలిచేవారు.
9. రాజమండ్రి..
– దీన్ని పూర్వం రాజమహేంద్ర వరం అని పిలిచేవారు. తరువాత రాజమండ్రిగా పేరు మారింది. అయితే 2015 లో మళ్లీ దీనికి రాజమహేంద్రవరం అని పేరు మార్చారు. పూర్వపు పేరునే పెట్టారు.
10. సిక్కోలు (చికాకొల్)..
– ఈ పేరు చెప్పగానే మీకు మరో పేరు గుర్తుకు వచ్చి ఉండాలే.. అవునండీ.. అదే.. శ్రీకాకుళం. ఒకప్పుడు దీన్ని సిక్కోలు అని చికాకొల్ అని పిలిచేవారు. తరువాత అదే శ్రీకాకుళం అయింది.
11. భాగ్యనగరం..
– మహమ్మద్ కులీ కుతుబ్ షా తాను ప్రేమించిన భాగమతి అనే నృత్యకారిణి పేరు మీదుగా తాను పాలించిన నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టగా ఆమె అతన్ని పెళ్లాడి ఇస్లాంలోకి మారింది. తరువాత హైదర్ మహల్ అని గుర్తింపు పొందింది. దీంతో భాగ్యనగరం కాస్తా హైదరాబాద్ అయింది.
12. పాలమూరు..
– నిజాం కాలంలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు పాలు అమ్మేవారట. అందుకే దీనికి పాలమూరు అని పేరు వచ్చింది. అయితే తరువాత నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అస్‌ఝా–VI పేరు మీదుగా ఈ ప్రాంతానికి మహబూబ్‌నగర్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అదే పేరుతో ఈ ప్రాంతం కొనసాగుతోంది.
13. ఓరుగల్లు..
– దీన్ని ఇప్పుడు వరంగల్ అని పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు దీనికి ఓరుగల్లు, ఏక శిలా నగరం, ఓమటికొండ అనే పేర్లు ఉండేవి. ఎందుకంటే వరంగల్ కోటను ఒకే గ్రానైట్ శిలపై నిర్మించారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందట.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Do you know how those districts were named in telugu states these are interesting facts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com