దేవీ నాగవల్లికి, దాసరి నారాయణరావు కి దూరపు చుట్టరిక ముందట. అందుకే ఆమె తన ఫేస్ బుక్ పోస్టింగ్లలో దాసరి నారాయణరావు ను తాతయ్య అని సంబోధించింది. అయితే ఆమె ఎప్పుడూ కూడా దాసరి నారాయణరావు పేరును వాడుకోలేదు. స్వతహాగానే పైకి రావాలని కోరుకుంది. అనుకున్నట్టుగానే ఇప్పుడు సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టీవీ9 లో ఉన్నప్పుడు అర్జున్ రెడ్డి సినిమా విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండను దేవి నాగవల్లి ఎంతలా టీజ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆదితో చేసిన ఇంటర్వ్యూ కూడా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. అది ఆమె వృత్తి ధర్మం కాబట్టి.. అలా చేసిందనుకుందాం. కానీ ఇప్పుడు ఆమె అదే ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. పుష్ప -2 సినిమా కోసం సుకుమార్ దగ్గర పనిచేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ సినిమాకు వర్క్ చేసింది. ఆమె పేరు కూడా పుష్ప -2 సినిమా టైటిల్ కార్డ్స్ లో పడ్డాయి.. ఆ సినిమా సక్సెస్ మీట్ ఆ మధ్య జరిగినప్పుడు సుకుమార్ దేవి నాగవల్లి గురించి ప్రముఖంగా చెప్పాడు. ఆమె వద్ద చాలా కధలు ఉన్నాయని.. ఫ్యూచర్లో ఆమె దర్శకత్వం వహిస్తే నిర్మాతగా మారే అవకాశం ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు.. సుకుమార్ మాట ఇచ్చాడు కాబట్టే.. దేవి నాగవల్లి అఫీషియల్ గా టీవీ9 నుంచి బయటకు వచ్చేసింది. గురువారం టీవీ9 మేనేజ్మెంట్ ఫేర్వెల్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. దేవి ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో రజనీకాంత్, సత్య, శిరీష, దీప్తి, ప్రణీత.. ఇంకా చాలామంది కనిపిస్తున్నారు. టీవీ9 టీం తెప్పించిన కేక్ ను దేవి కట్ చేసింది. “ఆల్ ది బెస్ట్ దేవీ నాగవల్లి.. ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్” అని ఆ కేక్ మీద రాసి ఉంది.
పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్స్
దేవి పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టు బిగ్ బాస్ షోలో చెప్పుకొచ్చింది. తనకు ఓ కొడుకు ఉన్నాడని.. భర్త అమెరికాలో ఉంటాడని.. తనకు వేరే లక్ష్యాలు ఉన్నాయని.. వాటిని చేదించడానికి తన వైవాహిక జీవితం అడ్డు కావద్దనే ఉద్దేశంతో.. భర్తకు విడాకులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. అంతకుముందు ఆమె అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండతో చేసిన ఇంటర్వ్యూ, హైపర్ ఆదితో నిర్వహించిన ముఖాముఖి, విశ్వక్ సేన్ తో గేట్ అవుట్ ఫ్రం మై స్టూడియో, ఆకాశం నుంచి రుధిరం కారుతోంది.. ఇలాంటి వివాదాలతో దేవి ఫేమస్ అయ్యింది. ఇవన్నీ ఆమె కెరియర్ కు హెల్ప్ అయ్యాయనే చెప్పవచ్చు.. అందువల్ల టీవీ 9 లో ఆమె కంటే ఎంతోమంది సీనియర్ యాంకర్లు ఉన్నప్పటికీ.. దేవికే విపరీతమైన పాపులారిటీ వచ్చింది. పైగా తన స్వతహాగా రాయగలుగుతుంది. రీసెర్చ్ చేయగలుగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని లోతుగా పరిశీలించగలుగుతుంది. అందువల్లే అన్ని కథలు రాసిందని సుకుమార్ పుష్ప సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. అంటే చూడబోతే దేవి నాగవల్లి దర్శకురాలుగా మారుతుంది అన్నమాట.. విజయనిర్మల తర్వాత, బిఎ జయ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ స్థాయిలో తమ మార్కు ప్రదర్శించిన మహిళాదర్శకురాలు ఇంతవరకు రాలేదు. సాయి సౌజన్య తెరపైకి వచ్చినప్పటికీ.. ఆమె ఒకటి, అరా చిత్రాలతోనే ఆగిపోయారు. చూడాలి మరి దేవి నాగవల్లి దర్శకురాలిగా ఏ స్థాయిలో ప్రతిభ చూపుతారో..