Telangana Election Results 2023: గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓటమి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ ఆదరించాలని కాంగ్రెస్ నాయకులు గత పదేళ్లుగా వేడుకోవడంతో రాష్ట్ర ప్రజలు ఈసారి అధికార పట్టం కట్టబోతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : December 3, 2023 3:47 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ జెండాలు మళ్లీ రెపరెపలాడుతున్నాయి. ఇన్నాళ్లు బోసిపోయినా గాంధీభవన్ కళకళలాడుతోంది. ఎప్పుడూ బాధతో రగిలిన కార్యకర్తల ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ లీడ్ లో కొనసాగుతుండడంతో ఇక అధికారం ఖాయమైనట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ జెండాతో గెలిచి ఆ తరువాత బీఆర్ఎస్ లోకి వెళ్లిన 9 మంది నాయకులపై ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సిట్టింగ్ కోటాలో వారు బీఆర్ఎస్ టికెట్ పొంది ఇప్పుడు ఓడిపోయారు. అప్పుడు గెలిచి కాంగ్రెస్ లో ఉంటే ఇప్పుడు వారికి మంచిరోజులు వచ్చేవి అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ వారెవరు?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ ఆదరించాలని కాంగ్రెస్ నాయకులు గత పదేళ్లుగా వేడుకోవడంతో రాష్ట్ర ప్రజలు ఈసారి అధికార పట్టం కట్టబోతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే 2014 లో గెలిచిన టీఆర్ఎస్ 2018లో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో కొందరు బీఆర్ఎస్ లోకి చేరిపోయారు. చేరిన వారిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారు.

అయితే ఈసారి వారు బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకొని ఓటమి చెందారు. అలా ఓడిపోయిన వారిలో పాలేరు-ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి -సురేందర్, ఖమ్మం జిల్లాలో మెచ్చా నాగేశ్వర్ రావు, రేగా కాంతారావు, కొత్తగూడెం-వనమా వెంకటేశ్వర్ రావు, వైరా -హరిప్రియ, భూపాలపల్లి- గండ్ర వెంకటరమణారావు, కొల్లాపూర్ -హర్షవర్దన్ రెడ్డి, పినపాక -రేగా కాంతారావు, నరికరేకల్ -చిరుమర్తి లింగయ్యలు 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత ఘర్ వాపసీ పేరుతో పార్టీ మారిన వారిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొస్తామని అప్పట్లో ప్రకటించారు. అందుకోసం శత విధాల ప్రయత్నం చేశారు. కానీ వారిలో ఒక్కరూ కూడా తిరిగి సొంత గూటికి రాలేదు. కానీ ఇప్పుడు వారు ఓడిపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పార్టీ మారి ఉంటే కచ్చితంగా గెలుపు ఉండేది కావొచ్చు అని అంటున్నారు. ఏదీ ఏమైనా కాంగ్రెస్ కు మంచిరోజులు వచ్చాయని అనుకుంటున్నారు.