Cow Vigilante Firing Incident: హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు క్షీణించి పోయాయని.. అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని బిఆర్ఎస్ సోషల్ మీడియా అడ్డగోలు విమర్శలు చేసింది. జరిగిన సంఘటన ఏమిటో తెలుసుకోకుండా తన సోషల్ మీడియా వేదికలలో పిచ్చిపిచ్చి ప్రచారాలు చేసింది. అయితే ఇప్పుడు ఈ ఘటన వెనుక సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా గులాబీ పార్టీ, దాని అనుబంధ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయాయి.
రాచకొండ సిపి సుధీర్ బాబు ఈ వ్యవహారంపై అత్యంత లోతుగా దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి పేరు ఇబ్రహీం. కాల్పులకు గురైన వ్యక్తి పేరు సోనూ సింగ్. సోను సింగ్ గో సంరక్షకుడిగా ఈ ప్రాంతంలో గుర్తింపు పొందాడు.. గో రక్షణ కోసం ఉద్యమాలు కూడా చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇబ్రహీం అనే వ్యక్తి పశు మాంసం వ్యాపారిగా ఉన్నాడు. సోను సింగ్ వ్యవహార శైలి ఇటీవల కాలంలో ఇబ్రహీం కు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఎలాగైనా సరే సోను సింగ్ అడ్డు తొలగించుకోవాలని అతడు భావించాడు. ఇందులో భాగంగానే సోను సింగ్ మీద కాల్పులు జరిపాడు. ప్రస్తుతం అతడు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇబ్రహీం జరిపిన కాల్పుల వల్ల సోను సింగ్ చాతి, ఉదరం మధ్యలో కుడివైపు బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం మొదటిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత రాచకొండ సిపి సుధీర్ బాబు రంగంలోకి దిగారు. లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. కాల్పులు జరిపి పారిపోయిన నిందితుడు ఇబ్రహీం ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. యామ్నంపేట ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోను సింగ్ మీద ఇబ్రహీం కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోను సింగ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగం లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ వ్యవహారాన్ని శాంతిభద్రతల లోపంగా చిత్రించడానికి గులాబీ మీడియా ఆపసోపాలు పడింది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు క్షీణించి పోయాయని ప్రచారం మొదలుపెట్టింది. చివరికి అసలు విషయం తెలియడంతో నాలుక కరుచుకుంది.