spot_img
HomeతెలంగాణTS Election Results 2023: కాంగ్రెస్‌ తొలి గెలుపు.. అశ్వారావుపేటలో బోణీ

TS Election Results 2023: కాంగ్రెస్‌ తొలి గెలుపు.. అశ్వారావుపేటలో బోణీ

TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం వెలువడింది. 11:30 గంటలకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కౌంటింగ్‌ పూర్తయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 28 వేల ఓట్ల మెజారిటీతో బోణీ కొట్టారు.

కొనసాగుతున్న కాంగ్రెస్‌ అధిపత్యం..
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం పది నియోజకవర్గాలకు గాను తొమ్మిదింటితో కాంగ్రెస్‌ మొదటి నుంచి ఆధిక్యం కనబరుస్తోంది. ఒకస్థానంలో సీపీఐ ఆధిక్యంలో ఉంది. తొలి విజయం అశ్వారావుపేట విడుదలైంది. మరికొన్ని నిమిషాల్లో భద్రాచలం కౌంటింగ్‌ కూడా పూర్తికానుంది. ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా కూనంనేని కాంగ్రెస్‌ మద్దతులో సాంబశివరావు పోటీ చేస్తున్నారు.

తెలంగాణలో మెజారిటీ మార్కు దాటిన కాంగ్రెస్‌..
ఇక తెలంగాణలో ఆధిక్యంతో కాంగ్రెస్‌ మెజారిటీ మార్కును దాటింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు 60 స్థానాలు అవసరం కాగా, కాంగ్రెస్‌ 65 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దాదాపు ఆధిక్యం ఉన్న అన్నిస్థానాల్లో మంచి మెజారిటీతోనే అభ్యర్థులు ఉన్నారు. కాస్త అటూ ఇటూ అయినా 60 స్థానాలు ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ 35 నుంచి 40 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రెండ్స్‌ పూర్తిగా కాగ్రెస్‌వైపే ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాక్ట్‌ పోల్స్‌ అవుతున్నాయి. దీంతో గాంధీ భవన్‌లో సంబరాలు కొనసాగుతుండగా, గులాబీ భవన్‌ వెలవెలబోతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version