Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రుణ మాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ తదితర పథకాలతో చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. జనవరి 26 నుంచి నాలుగు కొత్త పథకాలు కూడా అమలులోకి రానున్నాయి.
ఎమ్మెల్యే అభ్యర్థులపై తర్జన భర్జన..
ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకపోయిన త్వరలో జరిగి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు తర్జనభర్జనపడుతోంది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటు రెండు టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మార్చి 31 నాటికి మూడు ఎమ్మెల్సీ(MLC) స్థానాలు ఖాలీ కానున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ మాత్రం ఏటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఉన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాడాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయుట్ స్థానానికి ప్రాతిని«ధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నంచి పోటీ చేసి ఓడిపోయారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డిపై గెలిచిన సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో జగిత్యాల(Jagityala)లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ టికెట్ యువ నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ఇక ఆశావహులు ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విద్యాసంస్థల యజమానులు కూడా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు.
టీచర్స్ ఎమ్మెల్సీలపైనా..
ఇక టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఖమ్మం, నల్గొండ, వరంగల్ కాగా, ప్రస్తుతం ఇక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీకి చెందిన నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పోటీపైనా ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయ సంఘం తరఫున ఎవరినైనా నిలపాలని ఆలోచన చేస్తున్నారు. ఒక పట్టభద్రుల స్థానంపై దృష్టిపెడితే చాలన్న భావనలో కాంగ్రెస్ ఉంది.
స్వతంత్రులకు మద్దతు..
టీచర్స్ ఎమ్మెల్సీకి పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. ఉపాధ్యాయ సంఘం నేతలు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థికి మద్దతు ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో హస్తం పార్టీ ఉంది. ఇలా అయితే ఓడిపోయినా నష్టం ఉండదని భావిస్తోంది. అందుకే పట్టభద్రుల స్థానంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ప్రకటనలో జాప్యం..
కాంగ్రెస్‌పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేసింది. ఈ కారణంగా కొన్ని స్థానాల్లో ఓడిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చేవారి కోసం ఎదురు చూడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు అధికారంలో ఉన్నా… ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తోంది. ఈ జాప్యం కూడా గెలుపుపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.