CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ(Telangana)లో మూడు, ఆంధ్రప్రదేశ్(AndhraPradesh)లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తారు. అయితే షెడ్యూల్‌కు ముందే బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసింది. అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్‌ఎస మాత్రం తర్జనభర్జన పడింది. చివరకు జనవరి 31న గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. కేసీ వేణుగోపాల్ ఈమేరు ప్రకటన విడుదల చేశారు.
రేవంత్‌కు షాక్..
అయితే నరేందర్‌రెడ్డి ఎంపికతో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి అధిష్టానం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం తన అనుచరుడు వేం నరేందర్‌రెడ్డిని బరిలో దించాలని అనుకున్నారు. టీడీపీ నుంచి వీరు మంచి స్నేహితులు ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ బరిలో దించి గెలిపించాలని భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచే అభ్యర్థిని ప్రకటించింది. వాస్తవానికి జీవన్‌రెడ్డి(Jeevan Reddy) పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, తాను పోటీ చేయనని జీవన్‌రెడ్డి ఏఐసీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధిష్టానం అందరికి సుపరిచితుడైన నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది.
గ్రూపు రాజకీయాల కారణంగానే..
తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిలు జరుగుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదర్, నిజాబాబాద్ పట్టభద్రుల స్థానం టికెట్ కోసం పార్టీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. కానీ, అల్ఫోర్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి(Narendar Reddy) ఈ నాలుగు జిల్లాలకు సుపరిచితుడు. మరోవైపు ఎమ్మెల్సీ ఓటర్లలో మెజారిటీ ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం కూడా తీసుకోకుండానే అధిష్టానం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో గుస గుస..
గ్రాడ్యుయుట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీలోనే గుజగుసలు వినిపిస్తున్నాయి. వేం నరేందర్‌రెడ్డి కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలకు అధిష్టానం చెక్ పెట్టిందన్న చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ అనుకూల వర్గం మాత్రం రేవంత్‌రెడ్డి ఎవరినీ ప్రతిపాదించలేదంటోంది. ముందస్తు ప్లాన్‌లోభాగంగానే అధిష్టాం అభ్యర్థిని ప్రకటించినట్లు వాదిస్తోంది. వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటా బరిలో దింపే ఆలోచనలో సీఎం ఉన్నట్లు పేర్కొంటున్నారు. గ్రాడ్యుయేట్ బరిలో విజయం అంత ఈజీ కాదని వారు చెబుతున్నారు. అందుకే అధిష్టానం అల్ఫోర్స్ చైర్మన్‌ను ప్రకటించిందని అంటున్నారు.