CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మానసపుత్రికగా భావిస్తున్న హైడ్రాపై ఇప్పుడు భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు కూడా కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరు హైడ్రాను ఆపాలని విన్నవించారు. పార్టీకి, భ్రుత్వానికి నష్టం జరుగుతుందని తెలిపారు. అయినా హైడ్రా ఆగదంటున్నారు సీఎం. మరిన్ని అధికారాలు కూడా ఇచ్చారు. దీంతో సీఎం సొంత ఎజెండాల హైడ్రా ఉందన్న చర్చ హస్తం పార్టీలో జరుగుతోంది. మరోవైపు చెరువుల ఆక్రమణదారుల గుండెళ్లో బుల్డోజర్లు పరిగెత్తుతున్నాయి. చెరువులు ఆక్రమ ఇంచిన బడా బాబుల నుంచి సామాన్యుల వరకు అందరూ హైడ్రా పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు.
వందెకరాలకు విముక్తి..
చెరువులు, కుంటలు చెర విడిపించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడు పెంచింది. అధికారాలు అప్పగించేందుకు కేబినెట్ ఆమోదించడంతో స్పీడ్ మరింత పెంచింది. రెండు నెలల్లో 100 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించేందుక రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. న్యాయపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా హైడ్రాకు ఆటంకాలు తొలగిస్తున్నారు.
కేబినెట్ భేటీల్లో భిన్నాభిప్రాయాలు..
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో హూడ్రాకు మరిన్ని అధికారాలు అప్పగించే అంశంపై జరిగిన చర్చలో పలువురు మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. హైడ్రాను ప్రజలు ప్రశంసిస్తుండగా, మరోవైపు వ్యతిరేకత వ్యక్తమవుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. హైడ్రా పనితీరుపై ఆందోళనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారట ఇద్దరు మంత్రులు. హైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా తగ్గుతుందని తెలిపారట. హైదారాబాద్‌లో రియల్ ఎస్టట్‌పై హైడ్రా ప్రభావం పడుతోందని చెప్పారట. ఎవరు ఏం చెప్పినా రేవంత్‌రెడ్డి తగ్గేదే లేదని స్పష్ట ంచేశారని సమాచారం.
చట్టబద్ధతతో మరింత ప్రభావం..
ఇక ఓ మంత్రి హైడ్రా కారణంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.400 కోట్లు తగ్గిందని, బిడ్లర్లు, నిర్మాణ సంస్థలు కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతి తీసుకోవడానికి జంకుతున్నారని సీఎంకు చెప్పారని సమాచారం. ఈ క్రమంలో చట్టబద్ధత కల్పిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారట. హైడ్రా మంచిదే అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది. కానీ రేవంత్‌రెడ్డి మంత్రులు అభిప్రాయాలను లైట్ తీసుకున్నారని తెలిసింది.
వెనుకడుగు వేసేదే లేదని..
మంత్రి వర్గ సమావేశంలో హైడ్రాపై మంత్రుల సూచనలను లైట్ తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. హైడ్రాపై వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారట. ఏళ్ల తరబడి ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలను కాపాడే విషయంలో రాజీ లేదని తెలిపారట. మంచి పని చేసే సమయంలో కొంత నష్టం వస్తుందని మంత్రులకు సర్ది చెప్పారని తెలిసింది.