Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డు ఎవరికి ఇస్తారు? దీనిని ఎలా అప్లై చేయాలంటే?

సాధారణ ఆధార్ కార్డును దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇస్తారు. అదే బ్లూ ఆధార్ కార్డు అయితే ఐదేళ్లలోపు ఉన్న చిన్న పిల్లలకు ఇస్తారు. ఇది సాధారణ ఆధార్ కార్డు లాగానే 12 అంకెలతో ఉంటుంది. అయితే పిల్లలకు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు బయో మెట్రిక్ తో ఇవ్వరు. ఎలాంటి వేలి ముద్రలు, కంటి రేటినా స్కాన్ చేయకుండా చిన్న పిల్లలకు ప్రభుత్వ ఈ కార్డులను ఇస్తుంది.

Written By: Kusuma Aggunna, Updated On : September 23, 2024 2:21 pm

Blue Aadhaar Card

Follow us on

Blue Aadhaar Card : ప్రస్తుతం దేశంలో ఉన్న అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ దేశ పౌరునిగా గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉండాలి. అయితే ఈ ఆధార్ కార్డుల్లో కొన్ని రకాలు ఉంటాయి. సాధారణ ఆధార్ కార్డు, బ్లూ ఆధార్ కార్డు కూడా ఉంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం 218లో ప్రవేశపెట్టంది. అసలు సాధారణ ఆధార్ కార్డుకి బ్లూ ఆధార్ కార్డుకి తేడా ఏంటి? దీనిని ఎవరెవరికి ఇస్తారు? అసలు దీనిని ఎలా అప్లే చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐదేళ్ల లోపు పిల్లలకు..
సాధారణ ఆధార్ కార్డును దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇస్తారు. అదే బ్లూ ఆధార్ కార్డు అయితే ఐదేళ్లలోపు ఉన్న చిన్న పిల్లలకు ఇస్తారు. ఇది సాధారణ ఆధార్ కార్డు లాగానే 12 అంకెలతో ఉంటుంది. అయితే పిల్లలకు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు బయో మెట్రిక్ తో ఇవ్వరు. ఎలాంటి వేలి ముద్రలు, కంటి రేటినా స్కాన్ చేయకుండా చిన్న పిల్లలకు ప్రభుత్వ ఈ కార్డులను ఇస్తుంది. పిల్లలకు కేంద్ర, రాష్ట్ర నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు రావాలన్నా, స్కాలర్ షిప్లు, ఇంకా ఏవైనా ప్రయోజనాల కోసం వీటిని వాడుతుంటారు. పిల్లలకు ఈ ఆధార్ కార్డు ఉండటం వల్ల ప్రభుత్వం పథకాలు అన్ని వర్తిస్తాయి. అన్ని పథకాలకు అర్హులు అవుతారు. అదే బ్లూ ఆధార్ కార్డు లేకపోతే వాళ్లకు ఎలాంటి పథకాలు వర్తించవు. దీనిని ఐడెంటిటీ, అడ్రస్ ఫ్రూఫ్‌గా ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీ పిల్లలకు చిన్నతనంలో అంగన్‌వాడీ, స్కూల్‌లో చేర్చినప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు తప్పకుండా ఈ బ్లూ ఆధార్ కార్డును వెంట తీసుకోవాలి. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో ఈ ఆధార్ కార్డు తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, మధ్యాహ్న భోజనం, ఆరోగ్య భీమా వంటి వాటికి ఉపయోగపడుతుంది.

ఎలా అప్లై చేయాలంటే?
ఈ ఆధార్ కార్డును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌ లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలి. అందులోకి వెళ్లిన తర్వాత మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత న్యూ ఆధార్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫోన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి రిలేషన్‌షిప్ విత్ ఫ్యామిలీ అనే దగ్గర చైల్డ్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. 0-5 ఏళ్లు ఉన్న పిల్లలకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకు చెందిన వివరాలు నమోదు చేసి.. ఆధార్ కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఎలాంటి బయోమెట్రిక్ లేకుండా ప్రక్రియను పూర్తి చేసి 90 రోజుల్లోగా ఇంటికి పంపుతారు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకునే వాళ్లు డైరెక్ట్‌గా ఆధార్ సెంటర్‌కి వెళ్లాలి. అక్కడ బ్లూ ఆధార్ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పిల్లల బర్త్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ ఇస్తే.. పేరేంట్స్ ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తారు. ఈ బ్లూ ఆధార్ కార్డు పిల్లలకు కేవలం ఐదు ఏళ్లు వచ్చే వరకు మాత్రమే చెల్లుతుంది. తర్వాత చెల్లదు దీనిని అప్‌డేట్ చేసుకోవాలి. మళ్లీ అప్‌డేట్ చేయడానికి తల్లిదండ్రులు, పిల్లల ఆధార్‌కార్డుతో ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. బిడ్డకు గుర్తింపు నిచ్చే ఏ పత్రాలను అయిన సమర్పిస్తేనే అప్‌డేట్ చేస్తారు. పాఠశాల గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, ప్రభుత్వ అధికారం నుంచి జారీ అయిన పత్రం, రేషన్ కార్డు వంటి పత్రాలు ఇవ్వాలి. లేదా UIDAI వెబ్‌సైట్ లేదా యాప్‌లో కూడా చేసుకోవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ అయిన 1947 కు కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలుపుతారు.