Hydra: విశ్వనగరం హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలని, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా..(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ). ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. కమిషనర్ నియామకం సందర్భంగానే హైడ్రా ఎంత కఠినంగా ఉంటుందో చెప్పకనే చెప్పారు. కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైడ్రా దూకుడు చూసిన వారికి దాని గురించి ఇప్పుడు అర్థమైంది. తెలంగాణ తర, తమ బేధం లేకుండా అక్రమ నిర్మాణం అయితే హైడ్రా బుల్డోజర్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నాయి. ఇప్పటికే వందలాది అక్రమ కట్టడాలను నేటమట్టం చేసింది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసింది. సీఎం సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైడ్రాపై కొందరు విమర్శలు చేస్తున్నా.. సామాన్యుల నుంచి మాత్రం మద్దతు లభిస్తోంది. తెలంగాణ అంతటా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాల్లోనూ ఏర్పాటుకు సీఎం సిద్ధమవుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్‌లో ఆక్రమణలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలకు వెళ్లినా కోర్టుల్లో కూడా పోరాడతామని తెలిపారు. హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తామని కూడా పేర్కొంటున్నారు.
లీగల్ ఫైట్‌కూ రెడీ..
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, ఇతర ఆక్రమణలపై హైడ్రా పోరాడుతుంది. అయితే కోర్టు స్టే ఇచ్చినప్పటికీ నిర్మాణాలను కూల్చివేయడంపై అటు ఏజెన్సీ, ఇటు ప్రభుత్వం పలు విమర్శలు వస్తున్నాయి. అయితే రేవంత్ మాత్రం న్యాయవ్యవస్థతో పోరాటానికి సిద్ధమయ్యారు. తమ అనధికార నిర్మాణాల కూల్చివేతలను ఆపాలని బాధితులు కోర్టులను ఆశ్రయిస్తే తాత్కాలిక స్టే ఉత్తర్వులను రద్దు చేస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. న్యాయ పోరాటం విషయంలో వెనక్క తగ్గేది లేదని స్పష్టం చేశారు.
స్వచ్ఛందంగా తొలగించాలి..
ఎఫ్‌టీఎల్, లేదా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేసినవారు వాటిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేస్తే నష్టంతోపాటు కూల్చివేతకు అయ్యే చార్జీలను కూడా ఆక్రమణ దారుల నుంచే వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చేసిన విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవలే జయభేరి కన్‌స్ట్రక్షన్స్ యజమాని మురళీమోహన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. వెంటనే స్పందించిన ఆయన తమకు గడువు ఇస్తే తొగిస్తామని తెలిపారు. ఇలా ఎవరికి వారు అక్రమ నిర్మాణాలను తొలగించుకోవడమే ఇప్పుడు ఉత్తమంగా కనిపిస్తోంది. మరోవైపు, హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Cm revanth reddy says that hydra will not stop aggression must continue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com