Homeఆధ్యాత్మికంCM Revanth Reddy: వాటికీ ఉచిత విద్యుత్‌... సీఎం రేవంత్‌రెడ్డి సంచలననిర్ణయం.. విపక్షాలు సైలెంట్‌!

CM Revanth Reddy: వాటికీ ఉచిత విద్యుత్‌… సీఎం రేవంత్‌రెడ్డి సంచలననిర్ణయం.. విపక్షాలు సైలెంట్‌!

CM Revanth Reddy: వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒకటి. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్, బ్రిటిీష్‌ వారిపై భారత స్వాతంత్య్రోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు. వినాయక చవితిని ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న వినాయక చవితి నిర్వహించనున్నారు. ఈమేరకు వినాయ మండళ్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాలు తయారు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వినాయక విగ్రహాలు ఆర్డర్‌ ఇస్తున్నారు. గణనాథులు కూడా పూజకు సిద్ధమవుతున్నారు.

మండపాలకు ఉచిత విద్యుత్‌..
వినాయకచవితి పర్వదినం సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసుకునే గణేశ్‌ మండపాలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులు నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయంతో జరగాలన్నారు. అందరి సలహాలు,సూచనలు స్వీకరించేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశం..
గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న రేవంత్, దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్‌ అందించాలని అధికారులను ఆదేశించారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రతీ ఏరియాలో కోఆర్డినేషన్‌ కమిటీలను నియమించుకోవాలని చెప్పారు. వీవీఐపీ సెక్యూరీటీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణకు చాలా కీలకమైనదన్న రేవంత్‌ రెడ్డి రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరమన్నారు.

విపక్షాల సైలెంట్‌..
సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో విపక్షాలు సైలెంట్‌ అయ్యాయి. వినాయక చవితి రాగానే మండపాలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని, నిమజ్జనం నదుల్లోనే నిర్వహించాలని, నిమజ్జన వేడుకలకు డీజే అనుమతి ఇవ్వాలని తదితర డిమాండ్‌ చేసేవి. కానీ, ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి విపక్షాలకు ఛాన్స్‌ ఇవ్వకుండా ఉచిత విద్యుత్‌ ముందే ప్రకటించారు. దీంతో విపక్షాలు సైలెంట్‌ అయ్యాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular