HomeతెలంగాణCM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల కలకలం.. మండిపడుతున్న ఇండస్ట్రీ.. స్పందించని సీఎం...

CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల కలకలం.. మండిపడుతున్న ఇండస్ట్రీ.. స్పందించని సీఎం రేవంత్‌?

CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకూ హీటెక్కుతున్నాయి. ఎన్నికలు ముగిసి ఏడాది గడిసినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మాటల యుద్ధం కాస్త చేతల వరకు వచ్చింది. మొన్న కౌషిక్‌రెడ్డి ఇంటిపై, నిన్న కేటీఆర్‌ కారుపై దాడి జరిగాయి. అయినా ఆధిపత్యం కోసం దూకుడుగానే వ్యవహరిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఫలితంగా ప్రజాసమస్యలు పక్కదారి పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు, మూసీ పరీశాహక ప్రాంత ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన బీఆర్‌ఎస్‌.. దీంతో తమకు ఎంత లాభం వస్తుందన్న ఆలోచన మాత్రమే చేస్తోంది. హైడ్రాను విమర్శిస్తోంది. మూసీ ప్రక్షాళన వద్దంటోంది. తాజాగా కొండా సురేఖ వివాదం తెరపైకి వచ్చింది. కొండా సురేఖకు ఓ నేత పూలదండ వేస్తున్న ఫొటోను బీఆర్‌ఎస్‌ నాయకులు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. దీనిని ఖండించాల్సి బీఆర్‌ఎస్‌ నేతలు ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.

సంచలన వ్యాఖ్యలుచేసిన సురేఖ..
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరుతో సిని పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేశారని, కొంతమంది కాపురాలను కూల్చాడని పేర్కొన్నారు. సమంత–నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఒక మహిళగా తనపై బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ట్రోలింగ్‌ను కేటీఆర్‌ ఖండించకపోవడం బాధాకరమన్నారు. బీసీ మహిళనైన తనపై పోస్టులుపెట్టాలని కేటీఆరే చెప్పినట్లు ఉన్నారని ఆరోపించారు. తనతోపాటు గిరిజన మహిళ సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మ్మిపైనా ఇలాగే చేశారని తెలిపారు.

కొండా వ్యాఖ్యల ప్రకంపనలు..
ఇదిలా ఉంటే.. సమంత– నాగచైతన్య విడాకుల అంశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం, ఇండస్ట్రీలోని మహిళా నటుల గురించి మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా మొదట ఖండించారు. సినిమా నటులు అంటే అంత చులకా అని ప్రశ్నించారు. ఇక తర్వాత సమంత కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. తన విడాకుల వ్యవహారం తన వ్యక్తిగతమని, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని తెలిపారు. ఇద్దరి అంగీకారంలో విడుకులు తీసుకున్నామని తెలిపింది. ఇక మంత్రి కొండా వ్యాఖ్యలపై నాగార్జున కూడా స్పందించారు. దిగజారుడు రాజకీయాలు చేయొద్దని కోరారు. మంత్రి వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించారు. రాజకీయాల్లోకి తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాజాగా నాగార్జున భార్య అమల కూడా స్పందించారు. కొండా సురేఖ కామెంట్స్‌ మీద ట్వీట్‌ చేశారు. మంత్రి కొండా సురేఖ దెయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా మంత్రి అయి ఉండి కూడా ఇలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి హేమ, సింగర్‌ చిన్మయి కూడా మంత్రి వాఖ్యలను తప్పు పట్టారు.

సీఎం మౌనం..
తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నా.. సీఎం మాత్రం మౌనం వీడలేదు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఆయన కొండా సురేఖతో పర్సనల్‌గా మాట్లాడనిట్లు తెలుస్తోంది. మాటలు అదుపులో పెట్టుకోవాలని మంత్రికి చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ సారథిగా, ముఖ్యమంత్రిగా దీనిపై రేవంత్‌ స్పందించాలన్ని పరిస్థితి నెలకొంది. అయితే ఆయన ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం గురువారం స్పందిస్తారని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular