CM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నప్పటికీ.. సొంత మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. విమర్శలు చేయడంలోనూ తగ్గడం లేదు. పైగా బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని పిలుపునిస్తున్నారు. ఆ పార్టీని 100 మీటర్ల లోతులో పాతిపెట్టాలని స్పష్టం చేస్తున్నారు.
మేడారం జాతరలో భాగంగా అభివృద్ధి పనులను పరిశీలించి.. సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సోమవారం సాయంత్రం దావోస్ వెళ్ళిపోయారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఆయన మంత్రులతో కలిసి వెళ్లిపోయారు. దావోస్ ప్రాంతంలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. అక్కడ గూగుల్, యూనిలీవర్, హనీ వెల్, లోరెల్, నోవార్టీస్, సేల్స్ ఫోర్స్, టాటా గ్రూప్స్, డిపి వరల్డ్, సిస్కో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి వేరువేరుగా భేటీ అవుతారు. అంతర్జాతీయ ప్రతినిధులతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు..
చర్చలు, భేటీల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు , స్థాపించిన సంస్థల విస్తరణ పై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అదృష్ట సార్ ఇస్తారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సెండ్ చేసి ఉంటే రంగాలలో భారీగా పెట్టుబడులను తీసుకురావడమే తన లక్ష్యమని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. గత డిసెంబర్లో హైదరాబాదులో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమయంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించింది . మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ రూపొందించింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రదర్శించాలని అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో దావోస్ వెళ్ళిన వారిలో ఉన్నారు. ఈసారి కూడా భారీగా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా ముఖ్యమంత్రి రూపకల్పన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
