CM Relief Fund
CM Relief Fund: తెలంగాణ గడిచిన పదేళ్లలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, చెరువులు, కుంటల ఆక్రమణకు కేరాఫ్‌గా మారింది. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిపై దృష్టిపెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ పోతుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అక్రమాలపై ఫోకస్ పెట్టారు. కేసీఆర్ వన్‌మెన్ షో నడిపిస్తుండడంతో మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు పెద్దగా పని ఉండేది కాదు. దీంతో వాళ్లు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టారు. ముఖ్యంగా పేదల భూములు, ప్రభుత్వ భూములను కబ్జాచేసి విక్రయించి సమ్ము చేసుకున్నారు. అంగబలం, అర్ధబలంలో అక్రమాలు జోరుగా సాగించారు. ఇక డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సీఎంఆర్‌ఎఫ్ సాయం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం పేరుతో కిందిస్థాయి నేతలు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ప్రజల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్(సీఎంఆర్‌ఎఫ్) విషయంలో అయితే ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులతో చేతులు కలిసి చేయని వైద్యానికి కూడా డబ్బులు దండుకున్నారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్వాకం బట్టబయలైంది.
నకిలీ బిల్లులతో.. గుర్తించిన సీఐడీ..
ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు తాజాగా సీఐడీ గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై ఆరు కేసులను సీఐడీ బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్‌కు ముందు ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సీఐడీ తన ఎఫ్‌ఎఆర్ లో పేర్కొంది. సచివాలయంలోని సీఎంఎస్‌ఆర్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ విచారణ చెపట్టగా పేదల డబ్బులతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది.
వారి పాత్రపై ఆరా..
వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగులు పేరుతో మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది ఈ మోసాలకు తెరలేపారా? లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి ఈ స్కామ్ కు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. సీఎంఆర్ ఎఫ్ చెక్కుల దుర్వినియోగం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఈ కేసులో గతమంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వద్ద టేడా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసే వ్యక్తిపై సైతం కేసు నమోదు అయింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Cid has registered criminal cases against 30 hospitals for misusing cm relief fund
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com