Harsha Reddy: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి, పాలేరు శాసనసభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు పొంగులేటి హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మ** గూ* ఆర్డర్ ఇచ్చి.. అనవసరమైన ఇబ్బందుల్లో పడ్డారు. స్మ** గూ* లో పట్టుబడిన వస్తువులలో రెండు చేతి గడియారాలు ఉన్నాయి. అవి మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఆర్డర్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో చెన్నై నుంచి కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ వచ్చారు. హర్షా రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చి వెళ్లారు.
స్మ** గూ* ఆర్డర్ ఇచ్చిన కేసులో ఏప్రిల్ 4న విచారణకు రావాలని కస్టమ్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తనకు ఆరోజు ఆరోగ్యం బాగాలేదని హర్షారెడ్డి వెళ్లలేదు. ఏప్రిల్ 27 అనంతరం విచారణకు హాజరవుతారని హర్ష అధికారులకు సమాధానం గా చెప్పారు. అయితే హర్ష కోసం సింగపూర్ ప్రాంతం నుంచి రెండు చేతి గడియారాలను ముబిన్ అనే వ్యక్తి తెప్పించినట్టు తెలుస్తోంది. పటాక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ లగ్జరీ చేతిగడియారాలను హర్ష ఆర్డర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు బ్రాండ్లు భారతదేశంలో లభించవని తెలుస్తోంది. హర్ష కోసం ఈ బ్రాండ్లను ముబిన్ అక్కడినుంచి తెప్పించాడని సమాచారం.
తనిఖీల్లో భాగంగా ముబిన్ నుంచి ఆ రెండు చేతి గడియారాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హర్షా రెడ్డికి నోటీసులు జారీ చేశారు. హర్షా రెడ్డి కోసం ముబిన్ తీసుకొచ్చిన ఒక్కో చేతి గడియారం ఖరీదు 1.75 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ గడియారాలకు హవాలా మార్గంలో డబ్బులు చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 5న చెన్నై పోలీసులు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
ముబిన్ స్మ** గూ* రూపంలో తీసుకువచ్చిన చేతి గడియారాల స్కాం విలువ 100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. హర్షా రెడ్డికి, ముబిన్ కు మధ్య నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై కస్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ ను విచారించారు.. అతడు చెప్పిన వివరాల ఆధారంగా హర్షా రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో ముబిన్ గురించి కస్టమ్స్ అధికారులు నోరు మెదపడం లేదు. అంటే అతడు అధికారుల అదుపులో ఉన్నాడా? లేక పరారీలో ఉన్నాడా? అనేది తెలియాల్సి ఉంది. తుక్కుగూడలో బహిరంగ సభ విజయవంతమైన తర్వాత.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. హర్షారెడ్డి ఉదంతం రూపంలో ఒకసారి గా బ్రేక్ పడినట్టయింది. మరి దీనికి పొంగులేటి ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.