https://oktelugu.com/

భాగ్యనగరం భాగ్యరేఖలు మారుతున్నాయా..?

హైదరాబాద్‌నే మరో పేరుతో భాగ్యనగరంగా పిలుచుకుంటుంటాం. ఇప్పటికే ఎన్నో బహుళఅంతస్తులు.. మరెన్నో ప్రాచీన కట్టడాలతో పేరుగాంచిన సిటీ మామూలుగా విస్తరించడం లేదు. భాగ్యనగరం అభివృద్ధి రోజురోజుకూ ఖ్యాతిని చాటుతోంది. నలువైపులా ఏ దిక్కున చూసినా ఆకాశహర్మ్యాలే. ఇప్పుడు సిటీ అంతా తూర్పు దిశగా విస్తరిస్తోంది. దీంతో భాగ్యనగరం భాగ్యరేఖ మారుతున్నట్లే అని నిపుణులు అభిప్రాపడుతున్నారు. Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ హైదరాబాద్‌ తూర్పున స్థిరాస్తి మార్కెట్‌ పుంజుకుంటోంది. నివాసాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 4:17 pm

    Hyderabad

    Follow us on


    హైదరాబాద్‌నే మరో పేరుతో భాగ్యనగరంగా పిలుచుకుంటుంటాం. ఇప్పటికే ఎన్నో బహుళఅంతస్తులు.. మరెన్నో ప్రాచీన కట్టడాలతో పేరుగాంచిన సిటీ మామూలుగా విస్తరించడం లేదు. భాగ్యనగరం అభివృద్ధి రోజురోజుకూ ఖ్యాతిని చాటుతోంది. నలువైపులా ఏ దిక్కున చూసినా ఆకాశహర్మ్యాలే. ఇప్పుడు సిటీ అంతా తూర్పు దిశగా విస్తరిస్తోంది. దీంతో భాగ్యనగరం భాగ్యరేఖ మారుతున్నట్లే అని నిపుణులు అభిప్రాపడుతున్నారు.

    Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

    హైదరాబాద్‌ తూర్పున స్థిరాస్తి మార్కెట్‌ పుంజుకుంటోంది. నివాసాలకు అందరూ అటువైపే దృష్టి సారించారు. మెరుగైన మౌలిక వసతులు, బడ్జెట్‌ తగినట్లుగా సొంతిల్లు వస్తుండడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. ఆ రూట్లో ఇప్పుడు బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. 20 అంతస్తులకు పైగా గృహ నిర్మాణాల ప్రాజెక్టులు ఇప్పటికే కొందరు రియల్టర్లు మొదలు పెట్టారు. ఇన్నాళ్లు పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితమైన ఎత్తైన బిల్డింగ్‌లు ఇప్పుడు తూర్పుకూ విస్తరిస్తున్నాయి.

    దశాబద్ద కాలానికి పైగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల పశ్చిమ హైదరాబాద్‌లోనే స్థిరాస్త మార్కెట్‌ ఎక్కువ. ఏళ్ల తరబడి పశ్చిమ దిశగా మార్కెట్‌ విస్తరిస్తూనే ఉంది. ఇక్కడ భూములు ధరలు వింటే కూడా కల్లు బైర్లు కమ్మాల్సిందే. దీంతో మధ్య తరగతి వారు కూడా ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కోటి రూపాయలకు పైగా వెచ్చిస్తే కానీ సొంత ఇంటిని కొనలేం. అబ్బో ఇంత ధర మనతోకాదనుకున్న కొనుగోలు దారులు తమ బడ్జెట్‌లో ఎక్కడైతే దొరుకుతాయో అటువైపుగా దృష్టి సారించారు. తూర్పున ఉన్న ఉప్పల్‌, ఎల్‌బీ నగర్‌‌ పరిసరాల్లో తక్కువ రేట్‌లో బిల్డర్లు ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లు ఏమీ లేకుండే. ఇప్పుడు ఐదంస్తుల నంచి.. 20 అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి.

    నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు, ఎల్‌బీ నగర్‌‌ నుంచి మియాపూర్‌‌ వరకు మెట్రో రూట్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక్కడ డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. గంటలో మాదాపూర్‌‌, రాయదుర్గంలోని ఐటీ ఆఫీసులకు చేరచ్చు. దీంతో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసేవారు ఇటు వైపు చూస్తున్నారు. ఫ్లైఓవర్లు, అవుటర్‌‌ రింగ్‌ రోడ్డు ఉండడంతో రెసిడెన్షియల్‌ హబ్‌లు పెరుగుతున్నాయి.

    Also Read: అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

    ఇన్నాళ్లు ఈ ఏరియాల్లో రవాణా ఉన్నప్పటికీ పెద్దగా ఇన్‌ఫ్రా లేకుండా పోయింది. వీకెండ్‌లో కానీ.. సెలవుల్లో కానీ ఆహ్లాదంగా గడిపేందుకు పెద్దగా ఎంటర్‌‌టైన్‌మెంట్‌ స్థలాలు ఉండేవి కావు. ఇప్పుడు ఇక్కడ శిల్పారామం అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌ మూసీ బ్రిడ్జి పక్కన ఏర్పాటైంది. ఉప్పల్‌లో మల్లీప్లెక్స్‌ కొత్తగా ప్రారంభమైంది. ఎల్‌బీ నగర్‌‌ చుట్టుపక్కన పెద్ద సంఖ్యలో మల్లీప్లెక్స్‌లు నిర్మాణంలో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ చేరువలోనే ఉంది. కొత్త ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ వస్తున్నాయి. వైద్య సదుపాయాలూ పెరుగుతున్నాయి. ప్రైవేట్‌ స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందుకే.. ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది.

    ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం.. ఐటీ సంస్థలూ వస్తుండడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయి. ఐటీ ఆఫీసులకు తోడుగా కొత్తగా మరిన్ని ఏర్పాటుకు ప్రభుత్వం కూడా లుక్‌ ఈస్ట్‌తో ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందుకే.. ఇప్పుడు ఇటు సైడు ఇండ్లకు డిమాండ్‌ పెరిగింది. ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు, ఇంటి స్థలాల వెంచర్ల వరకు అందుబాటులో ఉన్నాయి. దూరం వెళ్లేకొలదీ ధరలు ఒక్కో విధంగా ఉన్నాయి. రూ.75 లక్షల్లో మంచి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ దొరుకుతోంది. రూ.50 లక్షలకు అటు ఇటుగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇల్లు వస్తోంది.

    Also Read : అన్న ఎన్టీఆర్ ను మరవని కేసీఆర్..