https://oktelugu.com/

ట్రంప్‌ సంస్కరణలు ఇండో అమెరికన్ల ఓట్లు రాల్చేనా

అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాలో ఎన్నికలకు వేళ అయింది. ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ల ప్రభావం గట్టిగానే ఉంటుంది. గత టర్మ్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందారు. ఆయన వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ట్రంప్‌.. ఈ నాలుగేళ్లలో భారతీయులకు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. మరోమారు బరిలో నిలుస్తున్న ట్రంప్‌కు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 02:13 PM IST

    American president trump

    Follow us on

    అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాలో ఎన్నికలకు వేళ అయింది. ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ల ప్రభావం గట్టిగానే ఉంటుంది. గత టర్మ్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందారు. ఆయన వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ట్రంప్‌.. ఈ నాలుగేళ్లలో భారతీయులకు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. మరోమారు బరిలో నిలుస్తున్న ట్రంప్‌కు ఈసారి ఇండో అమెరికన్లు మద్దతు తెలుపుతారా..? భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. ఆయన నుంచి తమకు గొప్ప మద్దతు ఉందని అంటున్నారు. అటు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌, ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ బరిలో నిలుస్తున్నారు. కమలా హ్యారిస్‌ ఆసియా అమెరికన్‌. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ. మరి ఇప్పుడు మన వాళ్లు ఎవరికి సపోర్టుగా నిలుస్తారో చూడాల్సి ఉంది.

    Also Read : ప్రజలకు శుభవార్త… నవంబర్ 1 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

    ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. ఆయన పాలన చాలా బాగుందని ట్రంప్ కితాబిచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలో జరిగిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ‘మీ అందరికీ తెలుసు గతంలో హోస్టన్‌లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ భారీ ఈవెంట్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నన్ను ఆహ్వానించారు. భారత్ నుంచి మనకు గొప్ప మద్దతు ఉంది. అలాగే మోదీ నుంచి కూడా మనకు గొప్ప మద్దతు ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇండియా పర్యటన గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. కరోనా మహమ్మారికి ముందు జరిగిన ఆ పర్యటన చాలా అద్భుతంగా సాగిందని.. భారత్ ఓ అద్భుతమని పేర్కొన్నారు.

    అయితే.. ఇండియన్ అమెరికన్లలో ఎక్కువగా పాపులర్ అయిన ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, కింబర్లీ గిల్‌ఫోయిల్‌లతో మీ తరపున ప్రచారం చేయిస్తారా..? అని ఓ జర్నలిస్ట్ ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘నాకు తెలుసు.. వారికి భారత్‌తో మంచి సంబంధాలున్నాయి..’ అని పేర్కొన్నారు. అయితే వారితో ప్రచారం చేయించేది లేనిది మాత్రం స్పష్టం చేయలేదు.

    కొద్దివారాలుగా అటు డెమోక్రాట్స్, ఇటు రిపబ్లికన్లు ఇరువురు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయకంగా డెమోక్రాటిక్ పార్టీకి ఓటు వేసే భారతీయ-–అమెరికన్లు నవంబర్ 3 ఎన్నికల్లో మాత్రం రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవలి మాసన్ సర్వే వెల్లడించింది. భారత ప్రధాని మోదీతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఉన్న మిత్రుత్వమే దీనికి కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్, ఆయన క్యాంపెయినర్స్ ఇటీవలి ప్రచారాల్లో పదేపదే ఇండియన్ అమెరికన్ల మద్దతు కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.

    Also Read : చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?