MLC Kavitha: కవిత కేల్‌ ఖతం.. బిగుస్తున్న లిక్కర్‌ స్కాం ఉచ్చు.. సీబీఐ సంచలన ఆరోపణలు..!!

ఢిల్లీ లిక్కర్‌ స్కాం సూత్రధారుల్లో కవిత ఒకరని సీబీఐ కోర్టుకు తెలిపింది. సౌత్‌ లాబీలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. ఇండో స్పిరిట్‌లో తనకు 33 శాతం వాటా ఉందని పేర్కొంది. పూర్తి విచారణకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది.

Written By: Raj Shekar, Updated On : April 12, 2024 7:06 pm

MLC Kavitha

Follow us on

MLC Kavitha: ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో సుమారు నెల క్రితం అరెస్ట్‌ అయి.. తిహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సే కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. కొడుకు పరీక్షల సాకుతో బయటకు రావడానికి ఆమె మధ్యంతర బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెగ్యులర్‌ బెయిల్‌పై విచారణ వాయిదా పడింది. రిమాండ్‌ ఏప్రిల్‌ 24 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. ఏప్రిల్‌ 11న కవితను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. శుక్రవారం(ఏప్రిల్‌ 12న) సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరు పర్చింది. ఈ సందర్భంగా కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.

సూత్రధారుల్లో ఒకరు..
ఢిల్లీ లిక్కర్‌ స్కాం సూత్రధారుల్లో కవిత ఒకరని సీబీఐ కోర్టుకు తెలిపింది. సౌత్‌ లాబీలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. ఇండో స్పిరిట్‌లో తనకు 33 శాతం వాటా ఉందని పేర్కొంది. పూర్తి విచారణకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది.

చాటింగ్‌లో స్కాం వివరాలు..
ఇక స్కాంలో కింగ్‌ పిన్‌గా ఉన్న కవిత తన పీఏ బుచ్చిబాబుతో జరిపిన చాటింగ్‌లో కీలక వివరాలు గుర్తించామని సీబీఐ తెలిపింది. ఆ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు పేర్కొంది. విజయ్‌నాయర్, అరుణ్‌పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లిలో కవిత స్కాం నడిపించారని ఆరోపించింది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అంతేకాకుండా కవిత ఆధారాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇండో స్పిరిట్‌లో కవిత తన బినామీల ద్వారా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. మాగుంట రాఘవ ద్వారా ఇండోస్పిరిట్‌ కంపెనీని ఎన్‌వోసీ కోసం కవిత ప్రయత్నించారని సీబీఐ న్యాయవాదులు వాదించారు. జోన్‌ 5కు రూ.5 కోట్ల చొప్పున ఐదు జోన్లకు కలిపి రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో జాప్యం జరిగినందుకు కవిత బెదిరింపులకు కూడా పాల్పడినట్లు పేర్కొన్నారు.

అరెస్టు సరికాదన్న కవిత..
ఇక సీబీఐ అరెస్టుపై కవిత తరఫున లాయర్లు కూడా కోర్టులో మెమో దాఖలు చేశారు. అరెస్టు సరికాదని పేర్కొన్నారు. దీంతో కోర్టు జోక్యం చేసుకుని తమ అనుమతితోనే అరెస్టు జరిగిందని, కోర్టును ప్రశ్నింకండి అని జడ్జి సుతిమెత్తగా హెచ్చరించారు. ఇక సీబీఐ అరెస్ట్‌పై రాత్రి 10.30 గంటలకు తనకు సమాచారం ఇచ్చారని దీనిపై లీగల్‌ ఓపీనియన్‌ కావాలని అడిగినా సహకరించలేదని కవిత కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం తీర్పును మధ్యాహ్నం 2 గంటల వరకు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.