Homeటాప్ స్టోరీస్Caste corporations funds issue: కులాలకు కార్పొరేషన్లు.. మరి నిధుల సంగతేంటి

Caste corporations funds issue: కులాలకు కార్పొరేషన్లు.. మరి నిధుల సంగతేంటి

Caste corporations funds issue: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బదులు తీసుకొస్తే తప్ప బండి నడిచే పరిస్థితి లేదు. పైగా అప్పులను కూడా కాల వ్యవధి అధికంగా పెంచి తీసుకొస్తున్నారు.. ఓపెన్ మార్కెట్లో బాండ్లను కూడా విక్రయిస్తున్నారు.. ఇంత చేసినప్పటికీ ఆర్థికంగా ఒత్తిడి తప్పడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ మధ్య కొత్తగూడెం జిల్లా చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి స్టంట్ వేసుకోవడానికి డబ్బులు లేక చనిపోయాడు. చివరికి తన ఆవేదనను ఒక లేఖ రూపంలో రాసి తనువు చాలించాడు.. ఇలాంటి ఆర్థిక ఇబ్బందికరమైన స్థితి ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరికొత్త పాచిక వేశారు.

తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ప్రభుత్వం తరఫున 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ ప్రకటిస్తూ సర్కులర్ విడుదల చేశారు. ఇందులో 11 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు..

బ్రాహ్మణ కార్పొరేషన్
చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్.

వాషర్ మెన్ కోపరేటివ్ కార్పొరేషన్..
చైర్మన్ గా డాక్టర్ దాసరాజు అజయ్ కుమార్, వైస్ చైర్మన్ బంగారు బాబు

కళ్ళు గీత కార్మికుల కార్పొరేషన్
చైర్మన్ మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్
వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్

పెరిక కార్పొరేషన్
చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు
వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్

మేర కార్పొరేషన్
చైర్మన్ సంఘ వెంకట రాజం
వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ

వాల్మీకి బోయ కోపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్ గట్టు తిమ్మప్ప
వైస్ చైర్మన్ బోయ నాగేష్

మున్నూరుకాపు కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్
చైర్మన్ బొమ్మ శ్రీరామ్
వైస్ చైర్మన్ అల్లం భాస్కర్

యాదవ కోపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్ రఘునాథ్ యాదవ్
వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్

వడ్డెర కోపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్ గుంజ రేణుక నారాయణ
వైస్ చైర్మన్ భక్తుల వెంకటేష్

తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
చైర్మన్ దూడెం వెంకటరమణ
వైస్ చైర్మన్ జక్కని అనిత

కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్
చైర్మన్ బండి రమేష్
వైస్ చైర్మన్ పరుచూరి మురళి

11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అయినప్పటికీ.. నిధుల కేటాయింపు ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్నార్థకం. గతంలో కెసిఆర్ అనే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొచ్చారు. తద్వారా కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకురావడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కనీసం వాటి ద్వారా జరిగిన ప్రగతి దాదాపు శూన్యం.

ఇప్పుడు తెలంగాణ ఆర్థిక రంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటికి నిధులను ఏ విధంగా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను చెల్లిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన నేపథ్యంలో.. వారి డిమాండ్లను నెరవేర్చుతామని అన్నారు. పెండింగ్ బకాయిలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే కొత్త కార్పొరేషన్లు తెలంగాణ ఆర్థిక రంగం మీద అదనపు భారం తప్ప.. ఉపయోగం లేని వ్యవహారం.. రాజకీయ నిరుద్యోగులకు పదవులు కల్పించడానికి తప్ప.. ఈ కార్పొరేషన్లు దేనికి పనికిరావునేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version