Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై కాంగ్ రిపోర్టును ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క. ఇందులో సంచలన విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అనేక విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించిందని కాంగ్ పేర్కొంది. సీడబ్ల్యూసీ కాళేశ్వరం డీపీఆర్ ఆమోదానికి ముందే కాళేశ్వం ప్రాజెక్టుకు సంబంధించి రూ.25 వేల కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలిపింది. ఇక ప్రాజెక్టు రీ డిజైనింగ్ కారణంగా రూ.700 కోట్ల వృథా అయినట్లు వెల్లడించింది. ప్రాణ హిత కోసం చేపట్టిన పనులు వృథా అయ్యాయని పేర్కొంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించగా, కాళేశ్వరం నిర్మాణంతో 50 వేల ఎకరాల ఆయకట్టు తగ్గిందని కాగ్ తెలిపింది.
అవసరం లేకున్నా అదనపు టీఎంసీ పనులు..
ఇక కాళేశ్వరం ప్రాజెక్టును రెండు టీఎంసీలకు ప్రతిపాదించి తర్వాత అవసరం లేకున్నా అదనపు టీఎంసీ పనులు చేపట్టారని కాంగ్ తెలిపింది. అదనపు టీఎంసీతో రూ.25 వేల కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కొంది. భూకంపాలపై అధ్యయనం చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని వెల్లడించింది. ఖర్చు పెరగినా ఉపయోగం పెరగలేదని తెలిపింది. విద్యుత్ కోసమే ఏటా రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. సాగునీటి మూల ధన వ్యయం ఎకరాకు రూ.6 లక్షలకు పెరిగిందని తెలిపింది. డీపీఆర్‌లో లోపాలు ఉన్నా.. పనులు చేశారు. ఇంకా రైతుబంధు అనర్హులకు ఇచ్చారని, రైతుబీమా కూడా అనర్హులకు చెల్లించారని వెల్లడించింది.
కులగణన తీర్మానం..
తెలంగాణలో కుల గణన చేపట్టాలన్న బీసీల డిమాండ్ నెరవేరబోతోంది. ఇందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీలో ఈమేరకు తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కులగణనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈమేరు అసెంబ్లీలో తీర్మానం పెట్టనుంది. బీసీల్లో మొత్తం 136 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనాభాలో ఏ సమాజికవర్గం ఎంత ఉందో తెలుసుకునేందుకే ఈ బిల్లు పెడుతున్నట్లు పేర్కొంది.