Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం(డిసెంబర్ 20న) గందరగోళంగా మారాయి. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల బదిలీపై ఏసీపీ బీఆర్‌ఎస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. దీనికి నిరసనగా సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చర్చ చేశారు. ఈఫార్ములా రేసుపై అసెంబ్లీల చర్చ చేపట్టాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినతిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో అధికార, విపక్ష సభ్యులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో స్పీకర్ మాట్లాడుతూ భూభారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైందని, ఈ నేపథ్యంలో తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పోలడియం వద్దకు దూసెకెళ్లేందుకు..
స్పీకర్ నిర్ణయంపై నిరసన తెలిపేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై పేపర్లు విసిరారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కాగితాలు, వాటర్ బాటిల్స్ విసిరేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.
చెప్పు విసిరాడని..
ఇదిలా ఉండగా షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ తమపై చెప్పు విసిరాడని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈమేరకు ఓ వీడియోను విడుదల చేశారు. పవిత్రమైన సభలో కాం్రVð స్ పార్టీ తన మార్కు రాజకీయాలు చూపిందని విమర్శించారు. తమపై చెప్పు విసిరిన ఎమ్మెల్యే శంకర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గందరగోళం మధ్యనే చర్చ..
స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎంత వారించినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన విరమించడం లేదు. దీంతో నిరసనల మధ్యనే మంత్రి రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ భూభారతి బిల్లుపై చర్చ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతున్నంత సేపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మంత్రి మాట్లాడిన అనంతరం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు స్పీకర్ అవకాశం కల్పించారు. కానీ ఆ పార్టీ తరఫున మాట్లాడేందుకు నిరాకరించడంతో స్పీకర్ బీజేపీకి అవకాశం ఇచ్చారు.