BRS Party : తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పాలించింది. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజలు గులాబీ పార్టీకి అప్పగించారు. కానీ, 2023 ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, బీఆర్‌ఎస్ నేతల బాధితులు పెరిగిపోయారు. దీని ఫలితం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిచించింది. బీఆర్‌ఎస్‌ను కేవలం 39 స్థానాలకు పరిమితం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. దీంతో బీఆర్‌ఎస్‌కు 2024లో కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. ఇక ఇదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలిపించలేదు. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే కేసీఆర్ కాలుజారి పడ్డాడు. ఆయన కోలుకున్నప్పటికీ.. అసెంబ్లీకి రావడం లేదు. కనీసం బయట కూడా కనిపించడం లేదు. ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావును కేసీఆర్ ఉసిగొల్పుతున్నారు. కానీ అతి విశ్వాసం ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. సీఎంపై ఇష్టారీతిన మాట్లాడడం, దొరతనం ప్రదర్శించడం, తప్పును కూడా కరెక్టే అని వ్యాఖ్యానించడం ఆ పార్టీపై ప్రజల్లో సానుకూలత తీసుకురాలేకపోతోంది.
2024లో కవిత అరెస్ట్..
2024లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, మాజీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. సుమారు 6 నెలలు తిహార్‌జైల్లో ఉన్నారు. 2024లో ఇది ఆ పార్టీకి షాక్, తర్వాత గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారి కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై నియమించిన కమిషన్లు విచారణ జరగుతోంది. తాజాగా ఈ ఫార్ములా రేసుకు సబంధించి రూ.54 కోట్లు కేటాయింపు విషయంపై తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
2025లో మరిన్ని కష్టాలు..
ఇక 2025లో బీఆర్‌ఎస్‌కు మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విచారణ కమిషన్లు మరో నెల రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి. వాటి ఆధారంగా గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు, మాజీ సీఎం కేసీఆర్‌పైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక తాజాగా ఈరేస్ కేసుపై జనవరిలో ఏసీబీ విచారణ చేయడంతోపాటు కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఔటర్ రింగ్‌రోడ్డు టోల్ కాంట్రాక్టుపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ విచారణలోనూ కేటీఆర్‌కు చిక్కులు తప్పేలా లేవు.
అతి విశ్వాసంతోనే..
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అధికరం కోల్పోయినా అతి విశ్వాసంతో కష్టాలు తెచ్చుకుంటోంది. ఔటర్ రింగ్‌రోడ్డుపై విచారణ జరిపించాలని హరీశ్‌రావే డిమాండ్ చేశారు. ఇక ఈ కార్ రేసులో తప్పు చేయలేదని, కేసు పెడితే పెట్టుకోండి అని కేటీఆరే అన్నారు. కేసు నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. అధికారం ఎక్కువ కాలం ఉండదన్న లాజిక్ మిస్ అయిన నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రాచరిక పాలనను తలపించేలా వ్యవహరించారు. మూడోసారి అధికారంలోకి వస్తామని చేసిన తప్పులు ఇప్పుడు గులాబీ నేతల మెడకు చుట్టుకుంటున్నాయి.
క్యాడర్‌లో గందరగోళం..
ముఖ్య నేతలు కేసులపాలవుతుండడంతో గులాబీ పార్టీ కేడర్‌లో మరోమారు గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఈ తరుణంలో ఆ పార్టీ నేతల తీరు, కేసులపాలవుతుండడం, కేసీఆర్ బయటకు రాకపోవడం, ముఖ్యనేతలు అరెస్ట అయితే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన కనిపిస్తోంది. ముఖ్య నేతలు అరెస్ట్ అయితే పార్టీ కేడర్ చీలిపోయే అవకాశం ఉంది.