Upendra : విభిన్నమైన ఆలోచనలతో, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించే అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో ఒకరు ఉపేంద్ర. హీరో గా ఈయన కన్నడ లో పెద్ద సూపర్ స్టార్. కానీ ఆడియన్స్ ఈయనని హీరో గా కంటే డైరెక్టర్ గా ఎక్కువ ఇష్టపడుతారు. ఆరోజుల్లోనే ఈయన నేటి తరం యువత ఆలోచనలకూ కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలు తీసి సెన్సేషన్ సృష్టించాడు. వాస్తవానికి ఆయన తీసిన సినిమాలు మన జనరేషన్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, మన తర్వాతి జనరేషన్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్స్ తో తీసాడు ఆయన. రా , ఉపేంద్ర , ఓంకార వంటి సినిమాలు సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వదిలాయి. ఇక ఆ తర్వాత ఉపేంద్ర ఎక్కువగా హీరోగా చేసేందుకే అమితాసక్తి చూపించాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆయన UI అనే చిత్రం తో దర్శకుడిగా మన ముందుకొచ్చాడు.
డిఫరెంట్ సబ్జెక్టు తో, ఉపేంద్ర మార్క్ టేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. టైటిల్ కార్డ్స్ దగ్గర నుండి ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో ఉపేంద్ర తన మార్క్ కనిపించేలా చేసాడు. ఇది ఆయన అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కన్నడ ఆడియన్స్ తో పాటు, తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి క్యూలు కట్టడంతో బుక్ షో లో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. గంటకి 7 నుండి 10 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయంటే ఈ సినిమాకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తున్నాయో ఊహించుకోవచ్చు. గడిచిన రెండు దశాబ్దాలలో ఉపేంద్ర సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఎప్పుడూ చూడలేదు. UI కి ముందు ఆయన నటించిన సినిమాలలో ‘బుద్దిమంతుడు’ ఒక్కటే కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ దీనికే ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి.
ట్రేడ్ విశ్లేషకులు వేస్తున్న అంచనా ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కన్నడ, తెలుగు భాషలకు కలిపి 25 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు. కన్నడలో సాయంత్రం నుండి అదనపు షోస్ షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నందున ఈ చిత్రానికి కచ్చితంగా ఊహకి అందని ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే తెలుగు, తమిళం, మలయాళం భాషలతో పోలిస్తే, కన్నడ భాషకు సంబంధించిన సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ ఉండదు. కేవలం కేజీఎఫ్ , కాంతారా చిత్రాలకు తప్ప, మిగిలిన ఏ సినిమాకి కూడా ఓవర్సీస్ లో వసూళ్లు రావడం మనం ఇప్పటి వరకు చూడలేదు. ఈ రెండు సినిమాలను కూడా అత్యధికంగా తెలుగు, హిందీ ఆడియన్స్ చూడబట్టే వసూళ్లు వచ్చాయి. కన్నడ వెర్షన్ కి సంబంధించిన వసూళ్లు చాలా తక్కువ. అందుకే UI చిత్రానికి ఓవర్సీస్ లో వసూళ్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.