https://oktelugu.com/

Kavitha: కల్వకుంట్ల కవితకు భారీ షాక్..!

లిక్కర్‌ స్కాం కేసులో కవితను సీబీఐ నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసింది. తర్వాత కోర్టులో హాజరు పర్చి 5 రోజుల కస్టడీ కోరగా సీబీఐ న్యాయమూర్తి 3 రోజులు కస్టడీకి ఇచ్చారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 15, 2024 / 12:47 PM IST

    Kavitha was sent to judicial custody till april 23

    Follow us on

    Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవితకు లిక్కర్‌ స్కాంలో మళ్లీ చుక్కెదురైంది. ఆమె కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది. దీంతో ఏప్రిల్‌ 23 వరకు ఆమె తిహార్‌ జైల్లోనే ఉండనున్నారు.

    కస్టడీ ముగియడంతో..
    లిక్కర్‌ స్కాం కేసులో కవితను సీబీఐ నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసింది. తర్వాత కోర్టులో హాజరు పర్చి 5 రోజుల కస్టడీ కోరగా సీబీఐ న్యాయమూర్తి 3 రోజులు కస్టడీకి ఇచ్చారు. మూడు రోజులు తిహార్‌ జైల్లోనే విచారణ చేసిన సీబీఐ సోమవారం(ఏప్రిల్‌ 15న) రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. న్యాయమూర్తి కావేరి బవేజా ముందు సీబీఐ వాదనలు వినిపిస్తూ సాక్షాలను కవిత ముందు పెట్టి విచారణ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో కవితను విచారణ చే సేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకు 14 రోజుల కస్టడీ కావాలని కోరింది.

    9 రోజుల కస్టడీకి అనుమతి..
    సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవితను 9 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 23 వరకు కవిత కస్టడీని పొడిగించింది.

    బీజేపీ కస్టడీ…
    అనంతరం పోలీసులు కవితను తిహార్‌ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సీబీఐ కస్టడీకి తీసుకోలేదని బీజేపీ కస్టడీకి తీసుకుందని ఆరోపించారు. రెండు నెలలుగా తనను అధికారులు అడిగిందే అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇందులో కొత్త ఏమీ లేదని విమర్శించారు.

    కవిత అరెస్టుకు నెల..
    ఇదిలా ఉండగా కవిత అరెస్టై ఏప్రిల్‌ 15 నాటికి సరిగ్గా నెల గడిచింది. మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను తాజాగా ఏప్రిల్‌ 10న సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఈ స్కాంలో అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలం, వాట్సాప్‌ చాట్స్‌పై సీబీఐ కవితను ప్రశ్నించింది. ఈ సమయంలో కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డు కూడా చేసింది. ఇక కవిత రెగ్యులర్‌ బెయిల్‌పై ఈనెల 16న విచారణ జరుగనుంది.