https://oktelugu.com/

ప్రియురాలి సమాధి దగ్గర చనిపోయిన ప్రియుడు.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న యువతీయువకులు రోజుల వ్యవధిలో చనిపోయారు. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందడంతో ప్రియురాలి సమాధి దగ్గర ప్రియుడు కూడా ఉరేసుకుని చనిపోయాడు. ప్రేమించిన అమ్మాయి లేని లోకంలో తాను కూడా ఉండలేనంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయా.. సోషల్ మీడియాలో రైతు ఆవేదన..! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పుర మండలం కుదురుపల్లిలో ఈ ఘటన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 26, 2020 / 05:15 AM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న యువతీయువకులు రోజుల వ్యవధిలో చనిపోయారు. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందడంతో ప్రియురాలి సమాధి దగ్గర ప్రియుడు కూడా ఉరేసుకుని చనిపోయాడు. ప్రేమించిన అమ్మాయి లేని లోకంలో తాను కూడా ఉండలేనంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.

    Also Read: కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయా.. సోషల్ మీడియాలో రైతు ఆవేదన..!

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పుర మండలం కుదురుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చల్లా మహేశ్ అనే వ్యక్తి వాలంటీర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇంతలో ప్రేమించిన యువతి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్ ఈరోజు ఉదయం ప్రియురాలు లేని లోకంలో జీవించలేనంటూ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

    ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సాప్ స్టేటస్ ద్వారా తాను ఈ లోకంలో జీవించనంటూ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ స్టేటస్ చూసిన కొందరు వెంటనే మహేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే మహేశ్ మహేశ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎస్సై అనిల్ కుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

    Also Read: భారత్‌లో కొత్తగా 45,148 కరోనా కేసులు

    చల్లా మహేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కొడుకు ప్రేమించిన యువతి చనిపోయిన రోజు నుంచి మానసికంగా కృంగిపోయాడని.. జీవితంపై విరక్తితోనే మహేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.