
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దసరా సందర్భంగా మరో ట్రీట్ ఇచ్చాడు. వరుసగా ఇప్పటికే 4 సినిమాలు అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా దసరా కానుకగా మరో సినిమా ప్రకటన చేశారు.
విజయదశమి కానుకగా పవర్ స్టార్ కి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఒక చిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. థమన్ మ్యూజిక్ అందించాడు.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న సాగర్ చంద్ర తాజాగా పవన్ కళ్యాన్ తో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. కమ్యూనిస్టు భావజాలంతో కథ తయారు చేశారని టాక్. పవన్ కళ్యాణ్ భావాలు అవే కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
పీడీఎస్ ప్రసాద్ సమర్పణలో సితార సంస్థ ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా సంచలనమైంది.
