MLA Venkata Ramana Reddy: వైయస్ రాజశేఖర్ రెడ్డి మహానేత. దీనిని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. ఆయన విధానాలను మెచ్చుకుంటారు.ప్రజాహితమే తన అభిమతంగా మార్చుకున్నారు ఆయన. రాజకీయ ఎంట్రీ సమయంలో..రాజకీయాలు చేసి ఉండొచ్చేమో కానీ..వాటి పర్యవసానాలు..అందులో ఉన్న వైఫల్యాలు అధిగమించి ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు.తన స్వరూపాన్ని మార్చుకున్నారు. అందరి మనసులు గెలవగలిగారు. పుష్కరకాలం దాటుతున్నా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ప్రజలకు ఆయన దేవుడిగా మిగలగా.. దగ్గర నుంచి చూసేవారు మాత్రం ఆయన నాయకత్వ పటిమను కొనియాడుతూనే ఉంటారు.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటరమణారెడ్డి రికార్డ్ సృష్టించారు. యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. సిట్టింగ్ సీఎం కెసిఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి లను ఓడించింది వెంకటరమణారెడ్డే. బిజెపి అభ్యర్థిగా బరిలో దిగి.. ఆ ఇద్దరు హేమాహేమీలను మట్టి కరిపించారు. అటువంటి వెంకటరమణ రెడ్డి తన ఇష్టుడైన నాయకుడు ఎవరని అడిగితే.. చాటుక్కున వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబుతారు. పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న వెంకటరమణారెడ్డి రాజశేఖర్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. అదే జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నా.. ప్రత్యేక అభిమానం మాత్రం వెంకటరమణ రెడ్డి పైనే రాజశేఖర్ రెడ్డి చూపేవారు. అటువంటి మహానేత అకాల మరణంతో వెంకటరమణారెడ్డి రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. కాంగ్రెస్ పార్టీని వీడేలా చేసింది. బిజెపిలో చేరి ఇద్దరు ఉద్దండులపై గెలుపొందేందుకు అవకాశం ఇచ్చింది. కానీ తనను నాయకుడిగా తయారుచేసిన రాజశేఖర్ రెడ్డిని మాత్రం ఇప్పటికీ వెంకటరమణారెడ్డి తన గుండెల్లో పెట్టుకోవడం విశేషం.
రాజశేఖర్ రెడ్డి వ్యక్తి గానే కాకుండా.. ఆయన ఆహార్యానికి కూడా వెంకటరమణారెడ్డి అభిమానే. ఆయన వలే పంచ కట్టుతో జూనియర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ల వెంకటరమణారెడ్డి కనిపిస్తారు. ఇటీవల సంచలన విజయంతో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి పై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2009లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అది. అప్పుడు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా వెంకటరమణారెడ్డి ఉండేవారు. ఓ రోజు సమతా భవన్ లో జిల్లాకు చెందిన మంత్రులు, కీలక నాయకులు రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఉండగా.. బయట ఓ రైతు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో గలాటా చోటు చేసుకుంది. దీనిని గమనించిన రాజశేఖర్ రెడ్డి ఆ రైతును లోపలికి విడిచి పెట్టమని కోరారు. రాజశేఖర్ రెడ్డి వద్దకు చేరుకున్న ఆ రైతు కన్నీరు మున్నీరయ్యాడు. పది రోజుల్లో తన కుమార్తె పెళ్లి ఉందని.. భూమి అమ్మకానికి పెడితే పట్టాదారు పాసు పుస్తకం లేదని.. మంజూరు చేయాలని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న పని కాలేదని సీఎం రాజశేఖర్ రెడ్డి కి విన్నవించాడు. తన ఇద్దరి కుమార్తెలకు పెళ్లి చేయాలంటే రెండు లక్షల రూపాయల అవసరమని.. పెళ్లి చూస్తే దగ్గర పడుతోందని తన గోడును వెళ్ళబోసుకున్నాడు.
దీనిపై స్పందించిన రాజశేఖర్ రెడ్డి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి ఫోన్ చేసి.. పట్టాదారు పాసుపుస్తకం రేపటికల్లా ఆయనకు మంజూరు చేయాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? మంత్రి ఎవరు తెలుసా? అని అడిగారు. అయితే సదరు రైతు తనకు తెలియదని దీనంగా చెప్పాడు. పోనీ నేను తెలుసా? అని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించడంతో.. మీరు తెలియని వారు ఉంటారా? అంటూ కృతజ్ఞతా భావంతో ఎదురు ప్రశ్న వేశాడు. కానీ రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించే సమయానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా మంత్రి అక్కడే ఉన్నారు.రైతు వెళ్లిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు మంత్రులకు క్లాస్ పీకారు. సంపాదించుకుంటున్నాం కదా.. కాస్త ఖర్చు చేస్తే పోయేదేముంది? మనం చేసే మంచి.. మనకు గుర్తింపునిస్తుంది.. అంటూ నాటి నిజామాబాద్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఆ మహానేత సముదాయించినట్లు.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అదే కదా రాజశేఖర్ రెడ్డి గొప్పతనం అంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
Goosebumps guarantee
YSR గురించి ఎవరికి తెలియని యదార్థ సంఘటన చెప్పిన BJP MLA వెంకట రమణా రెడ్డి❤️❤️ pic.twitter.com/wpyh3PWxNa
— MBYSJTrends ™ (@MBYSJTrends) December 9, 2023