spot_img
HomeతెలంగాణBeer Shortage In India Summer 2026: బీర్ల ప్రియులకు కష్టకాలం.. వేసవిలో త్వరపడండి..

Beer Shortage In India Summer 2026: బీర్ల ప్రియులకు కష్టకాలం.. వేసవిలో త్వరపడండి..

Beer Shortage In India Summer 2026: ఇరాక్, అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం మద్యంపై కూడా పడింది. ఇప్పటివరకు పెట్రోల్, గ్యాస్ కొరత మాత్రమే రాగా ఇప్పుడు బీర్ల సరఫరా తక్కువగా అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా బ్రూవరీస్ అసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) చేసిన కీలక ప్రకటన మద్యం బాబుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మిడిల్ ఈస్ట్ లో జరిగిన యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో బీర్ల తయారీల ఖర్చు పెరిగిందని.. దీంతో వీటి సరఫరాలో కొరత ఏర్పడవచ్చు అని బిఏఐ తెలిపింది. దీని గురించి పూర్తి వివరాలు కి వెళ్తే..

Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్

United Breweries, Carlsbetrg, AB inBev అనే సంస్థలు భారతదేశంలోని బ్రూవరీస్ అసియేషన్ ఆఫ్ ఇండియా లో కీలక సభ్యులుగా ఉన్నారు. వీరి వాటా 85% కంటే ఎక్కువగా కలిగి ఉంది. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా 55 కంటే ఎక్కువగా బ్రూవరీస్ లను నిర్వహిస్తున్నాయి. అయితే యుద్ధం కారణంగా బీర్ల తయారీలో భాగంగా గాజు సీసాల తయారీ ఖర్చులు పెరిగిపోతున్నట్లు ఆ కంపెనీలు తెలుపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రభావం బీర్ల ధరలపై కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరిశ్రమ అంచనాల ప్రకారం యుద్ధ ప్రభావం వల్ల దిగుమతి ముడి పదార్థాల ధరలు పెరిగాయి. వీటిలో ముఖ్యంగా గాజు సీసాల ధరలు సుమారు 20%, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు 20 నుంచి 25%, రవాణా వ్యయం 10% పెరిగింది. మొత్తంగా బీర్ల తయారీకి 12 నుంచి 15 శాతం ఉత్పత్తి ఖర్చు పెరిగినట్లు తెలుపుతున్నాయి. ఈ పెరిగిన వేయాలి అన్ని కంపెనీలు పూర్తిగా భరించలేకపోతున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ధర నియంత్రణ వల్ల ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ ధరకు సరఫరా చేయాల్సి వస్తుందని పరిశ్రమ వర్గం తెలుపుతోంది.

అయితే భారతదేశంలో మద్యం ధరలు ప్రతి రాష్ట్రం విడిగా నిర్ణయిస్తుంది. దీంతో ఆయా రాష్ట్రాల మధ్య మద్యం ధరలు తేడాలు ఉంటాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా విక్రయించడంతో ఒక్కో కేస్ పై రూ.100 వరకు నష్టం జరుగుతోందని బిఏఐ తెలుపుతోంది. అయితే లాభం లేకుండా సరఫరా కొనసాగించడం కష్టతరంగా మారుతున్న తరుణంలో కొన్ని కంపెనీలు తాత్కాలికంగా సరఫరా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి వేసవికాలంలో బీర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కానీ ఇదే సమయంలో బీర్ల సరఫరా తక్కువ అయితే వీటి ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు చెబుతున్నారు.

అయితే వేసవి డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని బీర్లపై ధరలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా ప్రీమియం బ్రాండ్లపై నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఇతర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా వేసవికాలంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బీర్ల కొరత ఏర్పడితే మద్యం బాబులకు కష్టమే అని కొందరు వాపోతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version