Homeఆధ్యాత్మికంBathukamma Festival: పువ్వులనే పూజించే పండుగ... తెలంగాణ ఆడబిడ్డల సంబురం.. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం..

Bathukamma Festival: పువ్వులనే పూజించే పండుగ… తెలంగాణ ఆడబిడ్డల సంబురం.. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం..

Bathukamma Festival: బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే వేడుక. ఆడ పడుచులు ఆనందంగా జరుపుకునే సంబురం. తొమ్మిది రోజులపాటు పూజలు అమ్మవారిగా కొలిచే వేడుక. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతితో మమేకకమైన పండుగ. జానపద గీతాలతో చిన్న పెద్ద అంతా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ చేసుకునే గొప్ప పండుగ. ఈ పండుగ వచ్చిందంటే రంగురంగుల పూలతో పల్లెలు శోభాయమానంగా మారుతాయి. నేల సింగిడిని తలపిస్తుంది. ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే కలర్‌ఫుల్‌ వేడుక. బుధవారం(అక్టోబర్‌ 2) నుంచి ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ విశిష్టత, మొదటి రోజు జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది. తదితర విశేషాలు తెలుసుకుందాం.

జీవితమే పండుగ..
బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దానినే బతుకమ్మ అంటారు. అంటే జీవితమంతా సంతోషంగా సాగిపోవాలనేది బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపదఅమావాస్యతో ప్రారంభం అవుతుంది. తెలంగాణలో దీనినినేపెత్రమావాస్య అని కూడా అంటారు. తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగలో తొలిరోజు తంగేడు, గునుగు, బంతి, చామంతి, పట్టుకుచ్చులు ఇలా తీరొక్క పూజలతో బతుకమ్మను పేరుస్తారు. దీనిని ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. సాయంత్రం కుడళ్ల వద్దకు తీసుకెళ్లి మహిళలంతా ఆడడం సంప్రదాయం. తొలి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మా పేర్కొంటారు. మొదటి రోజు బతుకమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ప్రసాదాన్ని ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటారు.

ఆ పేరెలా వచ్చింది..
ఇక బతుకమ్మ తయారీ కోసం ఒకరోజు ముందే పూలను సేకరించి అలా నిద్రలేచిన పూలతో బతుకమ్మ తయార చేయడం వలన తొలి రోజు బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మగా పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు అందుకే ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా పేరు వచ్చిందని చెబుతుంటారు.

సంస్కృతిని ప్రతిబింబించేలా..
తొలి రోజు మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీతజడ, రుద్రాక్ష, మందతార, పారితాం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేరుస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరించేలా, ఆడబిడ్డల సాదకబాదకాలు తెలియజేసేలా, కష్టసుఖాలు, అనుబంధాలు ఆవిష్కరించే పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. ముందుగా ఇంట్లో బతుకమ్మకు పూజలు చేస్తారు. తర్వాత సాయంత్రం ఆలయాలు, కూడళ్లలో ఆడిపాడి తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular