Barrelakka: పవన్ విషయంలో వైసీపీకి బర్రెలక్క స్ట్రాంగ్ కౌంటర్

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఎవరికి ఓటు వేయాలని నాయకత్వం స్పష్టత ఇవ్వలేదు. క్యాడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. కాంగ్రెస్ గెలిచింది. ఆ విజయాన్ని టిడిపి తనదిగా చెప్పుకోవడం ప్రారంభించింది.

Written By: Dharma, Updated On : December 5, 2023 11:38 am

Barrelakka

Follow us on

Barrelakka: ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి.. షార్ట్ కట్ లో ఊపేకుహ అంటారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ, టిడిపి నేతలు సైతం ఇదే తరహా సంబరాలు చేసుకుంటున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని.. టిడిపి తమ గెలుపుగా చెప్పుకుంటుంది. జనసేన ఓటమిని వైసిపి హైలైట్ చేస్తోంది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తుండడం విశేషం.

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఎవరికి ఓటు వేయాలని నాయకత్వం స్పష్టత ఇవ్వలేదు. క్యాడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. కాంగ్రెస్ గెలిచింది. ఆ విజయాన్ని టిడిపి తనదిగా చెప్పుకోవడం ప్రారంభించింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జెండాలతో టిడిపి జెండాలను కలిపే ప్రయత్నం చేసింది. కెసిఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ప్రచారం చేసుకుంటుంది. కానీ చంద్రబాబు,లోకేష్ లు మాత్రం తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములతో తమకు సంబంధం లేదని ప్రత్యేక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.

వైసిపి గురించి చెప్పనవసరం లేదు. తెలంగాణలో తన మిత్రుడు బీ ఆర్ఎస్ దారుణ ఓటమి వారికి కనిపించడం లేదు. బిజెపితో పొత్తుల కుదుర్చుకొని ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఓటమినే వైసిపి ఎక్కువగా ఆస్వాదిస్తుండడం వారి పరిస్థితిని తెలియజేస్తోంది. 8 స్థానాల్లో ఒక్క స్థానం కూడా నిలుపుకోలేకపోయారని.. మీది ఒక పార్టీయేనా అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వారికి వైయస్ షర్మిల కనిపించడం లేదు. అస్త్ర సన్యాసం చేసిన ఆమె తీరును విమర్శించే ధైర్యం లేదు. పోటీ నుంచి తప్పుకున్న టిడిపి తప్పును ప్రస్తావించడం లేదు. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ను మాత్రమే తప్పు పడుతుండడం.. వారి బేలతనాన్ని బయటపెడుతోంది.

ఇటువంటి తరుణంలో బర్రెలక్క చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలిన సంగతి తెలిసిందే. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. కానీ తెలంగాణ ప్రజల మనసును గెలిచారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో తనను పోల్చడం పై స్పందించారు. ” ఆయనతో నన్ను పోల్చడం సంతోషంగా అనిపిస్తుంది. పవన్ సార్ కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలన్న ఆశ ఆయనకు లేదు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో ఉన్నారు. ఓటమితోనే గెలుపు వస్తుంది ” అంటూ బర్రెలక్క వ్యాఖ్యానించారు. కనీసం బర్రెలక్క మాదిరిగా కూడా జనసేనకు ఓట్లు రాలేదని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు.. బర్రెలక్క సరైన సమాధానం చెప్పారని జనసేన నేతలు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.